Home Minister Amit Shah reacts on Hindenburg-Adani row
mictv telugu

హిండెన్‌బర్గ్-అదానీ వ్యవహారంపై స్పందించిన అమిత్ షా..!!

February 14, 2023

Home Minister Amit Shah reacts on Hindenburg-Adani row

అమెరికన్ సంస్థ హిండెన్‌బర్గ్ నివేదిక తర్వాత అదానీ గ్రూప్ పై రాజకీయ దుమారం చెలరేగిన విషయం తెలిసిందే. బీజేపీపై కాంగ్రెస్ నిరంతరం ఆరోపణలు చేస్తూనే ఉంది. ఈ విషయంపై కేంద్రహోంమంత్రి అమిత్ షా మొదటిసారిగా స్పందించారు. ఓ జాతీయ ఛానెల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడారు. అదానీ గ్రూప్ విషయంలో బీజేపీ దాచి పెట్టేది ఏమీ లేదన్నారు. మేం ఎవరికీ భయపడాల్సిన అవసరం లేదన్నారు అమిత్ షా. ఈ వ్యవహారం సుప్రీంకోర్టు పరిధిలో ఉందని…ఈ విషయంలో వ్యాఖ్యలు చేయడం సరికాదన్నారు.

 

హిండెన్ బర్గ్ నివేదికపై పార్లమెంట్ రాహుల్ గాంధీ ప్రసంగాన్ని ఎవరు రాసిచ్చారో తెలియదన్న అమిత్ షా..మోదీపై బీజేపీ డాక్యుమెంటరీపై కూడా స్పందించారు. అమిత్ షా 2002 నుంచి మోదీ ప్రతిష్టను దిగజార్చే కుట్ర జరిగుతుందని ఆరోపించారు. ఈ విషయం సుప్రీంకోర్టులో పెండింగ్ లో ఉన్నందున ఈ వివాదంపై మాట్లాడేందుకు నిరాకరించారు.
అదానీ-హిండెన్ బర్గ్ వివాదంపై కాంగ్రెస్ తోపాటు ఇతర ప్రతిపక్ష పార్టీలు ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆరోపణలు చేయడంతో రాజకీయ వివాదంగా మారిన సంగతి తెలిసిందే. జాయింట్ పార్లమెంటరీ కమిటీతో విచారణ జరిపించాలని డిమాండ్ చేస్తూ పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల సందర్బంగా ప్రతిపక్షాలు ఈ అంశాన్ని లేవనెత్తాయి. మోదీని టార్గెట్ చేశాయి. అదానీ గ్రూపులో ఎల్ఐసీ కొన్ని ప్రభుత్వ రంగ బ్యాంకుల పెట్టుబడులపై ప్రశ్నలు సంధించారు. అయితే ఆరోపలన్నింటినీ ప్రభుత్వం తోసిపుచ్చింది.