ఏయ్.. నీ రేటెంత? రేప్ బాధితురాలితో మంత్రి - MicTv.in - Telugu News
mictv telugu

ఏయ్.. నీ రేటెంత? రేప్ బాధితురాలితో మంత్రి

October 11, 2018

ఉన్నత స్థానాల్లో ఉన్నవారి ప్రవర్తన ఉన్నతంగా ఉండాలి. కానీ కొందరు నేలబారుగా, చవకబారుగా ప్రవర్తిస్తున్నారు. తప్పు చేసిన వారికి శిక్ష పడేలా చేయాల్సిన వారే తప్పు చేస్తున్నారు. న్యాయం కోసం వెళ్లిన బాధితులపై వెకిలి వేషాలు వేస్తున్నారు. నానా మాటలూ అంటున్నారు.

అత్యాచారం కేసులో తమకు న్యాయం చేయాలని బాధితురాలు.. మహారాష్ట్ర హోంమంత్రి దీపక్ వసంత్ కేసర్కార్‌ను వేడుకోగా అతడు నీచంగా ప్రవర్తించి, నోరుపారేసుకున్నాడు. వివరాల్లోకి వెళ్తే.. ఏడుగురు దుండగులు బాధితురాలికి, ఆమె కుమార్తెకు మత్తు మందు ఇచ్చి గ్యాంగ్ రేప్‌కు పాల్పడ్డారు. బాధితురాలు పోలీసులను ఆశ్రయించగా, ఒకరిని అరెస్ట్ చేసి మిగతావారిని వదిలేశారు. తనకు న్యాయం చేయాలని ఆమె మంత్రి దీపక్ను ఆశ్రయించింది. ఓదార్చాల్సిన మంత్రి దురుసుగా ప్రవర్తించాడు. . ఏయ్.. ఏం మాట్లాడుతున్నావ్.. నీ రేటెంత? ఎక్కువ మాట్లాడకు అని తిట్టాడు. దీంతో ఆమె మంత్రిపై పోలీసులకు ఫిర్యాదు చేసింది.

మంత్రి దీపక్ స్పందిస్తూ.. ఆమె నాపై తప్పుడు ఆరోపణలు చేస్తోంది. ఆమె కుటుంబానికి సాయం చేసేందుకు నేను సిద్ధంగా ఉన్నాను. ఆమె మా ఆఫీసుకు వచ్చిన రోజు అక్కడ చాలా మంది మహిళలు ఉన్నారు. అక్కడ ఏం జరిగిందో అందరూ చూశారు’ అని మంత్రి చెప్పుకొచ్చాడు.