Home Minister Taneti Vanitha commented on the volunteer posts
mictv telugu

ఉద్యోగాలు మనోళ్లకే ఇచ్చాం కదా.. ఇంకేంటీ? – హోం మంత్రి

June 28, 2022

ఏపీ హోం మంత్రి తానేటి వనిత వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. పశ్చిమగోదావరి జిల్లా నిడదవోలులో జరుగుతున్న వైసీపీ ప్లీనరీలో ఆమె పాల్గొన్నారు. ఈ సందర్భంగా పార్టీలో అసంతృప్తిగా ఉన్న కార్యకర్తలను ఉద్దేశించి మంత్రి మాట్లాడుతూ..‘కార్యకర్తలను పట్టించుకోవట్లేదని అనడం సరికాదు. వాలంటీర్ పోస్టులు కార్యకర్తల పిల్లలకే ఇచ్చాం కదా. ఎంపీటీసీ, జడ్పీటీసీ, వార్డు మెంబర్ల వంటి పదవులను కూడా పార్టీ ముఖ్య కార్యకర్తలకు ఇచ్చాం. ఇంకా అసంతృప్తి అంటూ మాట్లాడడం ప్రయోజనకరం కాదు’ అని అభిప్రాయపడ్డారు. దీంతో ప్రతిపక్షాల నాయకులు మంత్రి వ్యాఖ్యలపై అభ్యంతరం వ్యక్తం చేయడంతో పాటు విమర్శలు చేస్తున్నారు.