Home Ministry cancels FCRA licenses of two NGOs headed by Sonia Gandhi
mictv telugu

సోనియా గాంధీకి కేంద్రం షాక్.. లైసెన్సులు రద్దు

October 23, 2022

కాంగ్రెస్ నాయకురాలు సోనియా గాంధీకి చెందిన రెండు ఎన్జీఓలకు కేంద్రం షాక్ ఇచ్చింది. విదేశీ విరాళాల సేకరణలో అవకతవకలు జరిగాయంటూ ఆ రెండు ఎన్జీఓల ఎఫ్‌సీఆర్ఏను కేంద్ర హోం శాఖ రద్దు చేసింది. సోనియా గాంధీ నేతృత్వంలో నడుస్తున్న రాజీవ్ గాంధీ ఫౌండేషన్ (RGF), రాజీవ్ గాంధీ ఛారిటబుల్ ట్రస్ట్ (RGCT) చట్టాన్ని ఉల్లంఘించాయని ఆరోపించింది. నిధుల దుర్వినియోగం, ఐటీ రిటర్న్స్ దాఖలు చేసేటప్పుడు దానికి సంబంధించిన పత్రాలను వక్రీకరించడం చేయడం సహా, చైనా, విదేశాల నుంచి నిధులు పొందుతూ మనీలాండరింగ్‌కు పాల్పడుతున్నాయని అధికారులు తెలిపారు.

లైసెన్సులు రద్దు చేసిన రెండు ఎన్డీఓలకు సోనియాగాంధీ చైర్ పర్సన్‌గా ఉన్నారు. ట్రస్టీలుగా కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ, మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్, పార్టీ సీనియర్ నేత చిదంబరం, ప్రియాంక గాంధీ.. తదితరులు ఉన్నారు. రాజీవ్ గాంధీ ఫౌండేషన్.. 1991లో ఏర్పాటైంది. అణగారిన వర్గాలు, గ్రామీణ పేదల అవసరాలను తీర్చేంచుకు రాజీవ్ గాంధీ ఛారిటబుల్ ట్రస్ట్ ను 2002లో నెలకొల్పారు.