Home ministry has released notification for 1671 posts in intelligence department
mictv telugu

పదో తరగతి అర్హతతో ఇంటెలిజెన్స్ విభాగంలో ఉద్యోగాలు

October 29, 2022

Home ministry has released notification for 1671 posts in intelligence department

కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న వారికి ఇంటెలిజెన్స్ బ్యూరో శుభవార్త చెప్పింది. పదో తరగతి అర్హతతో 1521 సెక్యూరిటీ అసిస్టెంట్, 150 మల్టీ టాస్కింగ్ స్టాఫ్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది.

మొత్తం 1671 పోస్టులను భర్తీ చేయనున్నట్టు పేర్కొంది. అర్హత, ఆసక్తి కల వారు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలని సూచించింది. నోటిఫికేషన్ ప్రకారం దరఖాస్తు ప్రక్రియ నవంబర్ 5 నుంచి ప్రారంభమవుతుంది. అదే నెల 25 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. కనీసం పదవ తరగతి ఉత్తీర్ణత, స్థానిక భాషపై అవగాహన ఉండాలి. వయోపరిమితి గరిష్టంగా 27 ఏళ్లు ఉండగా, రిజర్వ్‌డ్ కేటగిరీలకు నిబంధనల మేరకు సడలింపు ఉంటుంది. మరిన్ని వివరాలకు అభ్యర్ధులు అధికారిక వెబ్‌సైట్ mha.gov.inని చూసి తెలుసుకోగలరు.