నాంపల్లిలో కరోనా అనుమానితుడు..నైజీరియా నుంచి రాక - MicTv.in - Telugu News
mictv telugu

నాంపల్లిలో కరోనా అనుమానితుడు..నైజీరియా నుంచి రాక

March 22, 2020

Home quarantine person found in nampally railway station.

కరోనా వైరస్ ప్రపంచాన్ని వణికిస్తోంది. ఇప్పటీకే ఈ మహమ్మారి దాదాపు 3 లక్షల మందికి సోకింది. ఈ వైరస్ బారిన పడి దాదాపు 12వేల మంది మరణించారు. 160కి పైగా దేశాల్లో కరోనా వైరస్ ప్రభావం చూపుతోంది. ఎన్నో దేశాలు లాక్‌డౌన్‌లో ఉన్నాయి. ప్రజలెవ్వరూ బయటికి రాకూడదని ఆయా దేశాల ప్రభుత్వాలు ఆదేశిస్తున్నాయి. మనదేశం ఈ రోజు జనతా కర్ఫ్యూ నిర్వహిస్తోంది. ప్రజలందరూ ఇళ్లకే పరిమితమయ్యారు. ఇదిలా ఉంటే.. నాంపల్లి రైల్వే స్టేషన్లో కరోనా అనుమానితుడు కలకలం సృష్టించాడు.

హైదరాబాద్‌ మంగళ్‌హాట్‌కి చెందిన మోసిన్‌ అలీ… నైజీరియా, లాగోస్‌ నుంచి అబుదబీ మీదుగా విమానంలో ముంబయి వచ్చాడు. ముంబయి నుంచి ముంబయి ఎక్స్‌ప్రెస్‌ రైల్లో నాంపల్లి రైల్వే స్టేషన్‌కి ఈరోజు ఉదయం చేరుకున్నాడు. అతడి చేతిపై హోమ్‌ క్వారంటైన్‌ ముద్ర ఉండటంతో తోటి ప్రయాణికుడు పోలీసులకు సమాచారం అందించాడు. నాంపల్లి రైల్వే పోలీసులు వెంటన్‌ మోసిన్‌ అలీని 108 అంబులెన్స్‌లో గాంధీ ఆసుపత్రికి తరలించారు.