మోహన్ బాబుకు, విష్ణుకు ఇళ్ల పట్టాలు.. హావ్వ! - MicTv.in - Telugu News
mictv telugu

మోహన్ బాబుకు, విష్ణుకు ఇళ్ల పట్టాలు.. హావ్వ!

March 1, 2022

vishnu

ఆంధ్రప్రదేశ్‌లో సాగు భూమి లేని నిరుపేదలకు కేటాయించాల్సిన దరఖాస్తు పట్టాలను సినీ ప్రముఖుడు మోహన్ బాబు, అతని కుమారుడు విష్ణు పేరిట మంజూరు చేయడం కలకలం రేపుతోంది. మోహన్ బాబు, విష్ణుల పేరిట దరఖాస్తు పట్టా భూములు మంజూరు చేసినట్లు ఆల్‌లైన్ రెవెన్యూ రికార్డుల్లో బహిర్గతం అయింది. దీంతో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది.

ఈ సందర్భంగా నెటిజన్లు తీవ్రంగా మండిపడుతున్నారు. ‘సినీ ప్రముఖులు కూడా నిరుపేదలేనా..?’ అంటూ కామెంట్స్ చేస్తున్నారు. మరీ ఇంతకి ఈ భూమి ఎక్కడిది?, ఎవరు ఈ పట్టా ఇచ్చారు? అనే విషయంలోకి వెళ్తే.. చిత్తూరు జిల్లా చంద్రగిరి మండలం రామిరెడ్డిపల్లిలోని 68 గ్రామ రెవెన్యూ లెక్క దాఖలా సర్వే నంబర్ 412-1ఎలోని 2.79ఎకరాలను ఎం.మోహన్ బాబు పేరిట, 412-1బిలో 1.40ఎకరాలను విష్ణువర్ధన్ పేరిట దరఖాస్తు పట్టా ఇచ్చారు. ఈ పట్టాను 2015లోనే మంజూరు చేశారు. ఆ వివరాలు ప్రస్తుతం బహిర్గతం అయ్యాయి. దీనిపై తహసీల్దారు శిరీషను బాధితులు వివరణ కోరారు. దీంతో స్పందించిన ఆమె పూర్తి వివరాలను పరిశీలించి, త్వరలోనే ఉన్నతాధికారులకు తెలుపుతామని అన్నారు.