Home remedies for glowing skin in winter
mictv telugu

పొడిబారిన చర్మానికి నిగారింపు రావాలంటే..

November 16, 2022

చలి వణికించడమే కాదు.. చర్మం పొడిబారిలే చేస్తుంది. పొడిబారే చర్మతత్వం ఉన్నవాళ్లుంటారు, జిడ్డు కారే చర్మం ఉంటుంది. అలాంటి వాళ్లకు ఒకే ఫేక్ ప్యాక్ వేసుకుంటే ఎలా? ఎలాంటి చర్మతత్వం ఉన్నవాళ్లు ఈ చలికాలంలో వేసుకోవాల్సిన ఫేస్ ప్యాక్స్ ఇవి..

1. జిడ్డు కారే చర్మతత్వంతో ఉన్నారా? అయితే ఈ ప్యాక్ తప్పక వేసుకోవాల్సిందే! ఈ సమయంలో వీరికి యాక్నే సమస్య కూడా ఎక్కువ అవుతుంది. కాబట్టి పసుపు, పాలు, శనగపిండి కలిపి ముఖానికి రాయాలి. పూర్తిగా ఆరిన తర్వాత ముఖాన్ని కడిగేయాలి. ఇలా తరుచుగా చేయాల్సి ఉంటుంది.

 

‌‌2. రెండు టీ స్పూన్ల తేనె, కొద్దిగా పెరుగు, చిటికెడు పసుపు వేసి కలుపాలి. ముఖానికి, మెడకు పూర్తిగా రాసి పావుగంట పాటు అలాగే ఉంచాలి. ఆ తర్వాత గోరువచ్చని నీటితో కడిగేయాలి. ఈ ప్యాక్ ట్యాన్ని తగ్గిస్తుంది. చర్మం పొడిబారకుండా ఉంటుంది.

 

‌‌3. చలికాలంలో చర్మం బాగా పగిలిపోతుంది. అలాంటి సమయంలో ఈ ప్యాక్ బాగా ఉపయోగపడుతుంది. దీనికోసం మెత్తటి అరటిపండులో రోజ్వాటర్ అప్లయ్ చేరాలి. ఆరిన తర్వాత కడిగేయాలి. వారానికి రెండుసార్లు ఇలా చేయాలి.

‌4. రెండు టేబుల్స్పూన్ల ఓట్స్ని మెత్తగా పొడిలా చేసుకోవాలి. దీంట్లో పెరుగు, నిమ్మరసం వేసి కలుపాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి రాసి పావుగంట వదిలేయాలి. ఈ ప్యాక్ ముఖంలో ఉన్న డల్నెస్ని తగ్గించి ముఖారవిందాన్ని పెంచుతుంది.

 

‌‌‌5. అలోవెరాకి చర్మాన్ని హైడ్రేట్ చేసే గుణం ఉంటుంది. అందుకే తాజా అలోవెరాలో నుంచి జెల్ తీయాలి. దీనికి బాదం నూనె కలిపి ముఖానికి , మెడకు రాయాలి. పూర్తిగా ఆరిన తర్వాత గోరువెచ్చని నీటితో కడిగేయాలి. ఇలా వారానికి ఒకసారి చేస్తే మంచి ఫలితం ఉంటుంది.