మీకు ఎన్ని పాన్ కార్డులున్నాయి. ఒకటే ఉందా అయితే ఒకే. అంతకు మించి ఉంటే మీరు పది వేల రూపాయల జరిమానా కట్టేందుకు రెఢీగా ఉండండి. పాన్ కార్డులపై కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది. నిబంధనలు ఉల్లంఘంచిన వారికి ఫైన్ వేసేందుకు సిద్దం అవుతున్నది. ఇప్పటికే 11.44 లక్షల మంది పాన్ కార్డులు రద్దు చేసిందట ప్రభుత్వం. ఒకటి కంటే ఎక్కువ పాన్ కార్డులున్న వారివి ముందుగ రద్దు చేశారట.
మరో తాము తీసుకున్న చర్యల కారణంగా ఐటి రిటర్నులు బాగా పెరిగాయని అంటున్నది ప్రభుత్వం. దేనికైనా మంచిది…..మీ పాన్ కార్డు వివరాలు… అన్ని ఓ సారి చెక్ చేసుకోండి. ఒకటి కంటే ఎక్కువగా ఉంటే వాటిని తీసేయండి. లేక పోతే ఇబ్బందుల్లో పడ్తారు