ఈ నీచ్ కమీన్ గాళ్లు..చెప్పుకోలేని చోట నిప్పంటించారు.. - MicTv.in - Telugu News
mictv telugu

ఈ నీచ్ కమీన్ గాళ్లు..చెప్పుకోలేని చోట నిప్పంటించారు..

June 15, 2017

ఈ బద్మాష్ గాళ్లు ఫుల్లు గా మందు కొట్టారు. అర్ధరాత్రి రోడ్ల మీద తిరుగుతూ అల్లరి జేశారు. అంతటి ఆగితే పోయేది..నిషాలో ఏం చేశారో తెలుసా..? అది చెబితే ఆ నీచ్ కమీన్ గాళ్లపై ఉమ్మేస్తారు. కొట్టకుండా మాత్రం వదలరు..ఇంతకీ కలికాలపు కుర్రపాపులు ఏం చేశారంటే…

చెన్నైలో ఓ నిరాశ్రయుడు రోడ్ మీద పడుకున్నాడు. చిత్తుగా ఆ దారిలో వెళ్తున్న కొంతమంది యువకులు అతన్ని చూశారు. వణుకుతూ రోడ్ పైనే పడుకున్న అతనికి దుప్పెట్టా ఇవ్వకపోయిన ఫర్వాలేదు… కానీ వారి తల్లిదండ్రులు తలదించుకునే పనిచేశారు. వీళ్లనా మేం కన్నది అని సిగ్గుపడేలా పడేలా చేశారు. రోడ్డుపై పడుకున్న వ్యక్తికి చెప్పుకోలేని చోట నిప్పు పెట్టారు. కొందరు కాలిస్తే మరికొందరు వీడియో తీసి శాడిజం చూపించారు. వాట్స‌ప్ లో త‌మ మిత్రుల‌కు పంపించారు. ఈ ఘ‌ట‌న పై స్పందించిన పోలీసుల‌కు యువ‌కులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.