స్వలింగ సంపర్కం.. మంకీపాక్స్ లక్షణాలు ఇవే.. - MicTv.in - Telugu News
mictv telugu

స్వలింగ సంపర్కం.. మంకీపాక్స్ లక్షణాలు ఇవే..

May 24, 2022

రెండు సంవత్సరాలపాటు ప్రపంచ దేశాలను గడగడలాడించిన కరోనా మహమ్మారి ఇంకా పోకముందే ‘మంకీపాక్స్’ కలకలం రేపుతోంది. స్వలింగ సంపర్కులు, ద్విలింగ సంపర్కులైన పురుషుల కలయికతో ఈ రోగం మొదలైందని పరిశోధకులు చెబుతున్నారు. ప్రపంచ దేశాలను భయాందోళనకు గురిచేస్తున్న వ్యాధి ఎలా సోకుతుంది? లక్షణాలు ఎలా ఉంటాయి? ఏ చర్యలు తీసుకోవాలి? అన్న వివరాలను బ్రిటిష్ ఆరోగ్య రక్షణ సంస్థ తెలిపింది.. ”ఈ వ్యాధి ఆఫ్రికా మధ్య, పశ్చిమ ప్రాంతాల్లో కోతుల్లో కనిపిస్తుంది. అక్కడి నుంచి యూరప్‌కు పాకింది. బ్రిటన్‌లో 20, అమెరికా, కెనడా, ఇజ్రాయెల్, ఆస్ట్రేలియా దేశాల్లో 80 మంకీపాక్స్ కేసులను గుర్తించాం. ఇది వైరల్ వ్యాధి అంత త్వరగా మనుషులకు సోకదు. ఎవరైతే వ్యాధి పీడితులతో అత్యంత సన్నిహితంగా ఉంటారో వారికే మాత్రమే త్వరగా సోకుతుంది. లైంగిక క్రియ ద్వారా కూడా ఇది సోకుతుంది” అని వెల్లడించింది.

మంకీపాక్స్ లక్షణాలు ఇవే..

1. అధిక జ్వరం, ఒళ్ళు నొప్పులు, చర్మం మీద బొబ్బలు వస్తాయి.
2. పెద్దలపై అంతగా ప్రభావం చూపదు. పిల్లలపై ప్రభావం ఎక్కువగా చూపుతుంది.
3. మంకీపాక్స్ కోవిడ్ లాంటిది కాదు. గాలి ద్వారా వ్యాపించదు.
4. ఈ వ్యాధి సోకిన వ్యక్తి 21 రోజుల పాటు ఐసోలేషన్‌లో ఉండాలి. ఎవరిని కలవకూడదు.
5. వృద్ధులు, దీర్ఘకాల వ్యాధిగ్రస్తులు, గర్భిణులు, 12 ఏళ్ల బాల బాలికలు దూరంగా ఉండాలి.

ఇక, ఈ వ్యాధిని కట్టడి చేయడానికి అధికారులు మశూచి టీకాలను వేస్తున్నారు. వ్యాధిగ్రస్తులకు సమీపంగా వెళ్లిన వారికి ఈ మశూచి టీకా వేయడంతో వారిలో లక్షణాలు క్రమ క్రమంగా తగ్గి, ప్రాణప్రాయం నుంచి బయటపడుతున్నారని బ్రిటన్ ఆరోగ్య రక్షణ సంస్థ ప్రధానాధికారి సూజన్ హాష్కిన్స్ పేర్కొన్నారు.