ఈ బండి.. జగమొండి..చివరకు భరించలేక..
బైక్ బాగుంటే బిందాస్ రైడింగ్. ఎంత దూరం ఉన్నా ఈజీగా వెళ్లొచ్చు. లాంగ్ జర్నీలో ఆగిపోయిందంటే చుక్కలే. కిలోమీటర్ , రెండు కిలోమీటర్లంటే సస్తూ బతుకుతూ తోయొచ్చు. అంతకు మించి అంటే వామ్మో అనాల్సిందే.ఒక్కసారికే పరిస్థితి ఇలా ఉంటే ..కొత్త బైక్ 25 సార్లు రిపేర్లు పెట్టిందంటే…
చూడటానికి ఈ హోండా యాక్టివా భలే కొత్తగా కనిపిస్తుంది కదూ. ఎక్కితేనే దీన్ని అసలు మేటర్ తెలుస్తుంది. చెన్నైకి చెందిన కుప్పూ సామి ఎంతో ఇష్టపడి కొన్నాడు. కానీ కొన్న వారం నుంచే రిపేర్లు మొదలయ్యాయి. ఎక్కడ ఆగిపోతుందో ,ఎందుకు ఆగిపోతుందో తెలియదు.. ఏడాదిలో 25 సార్లు దుకాణం పెట్టింది. ఎన్నో రోజులుగా నరకయాతనపెడుతోంది ఈ హోండా యాక్టివా. సడెన్ గా ఆగిపోతే ఎన్నిసార్లు కిలోమీటర్ల కొద్ది తోసుకెళ్లాడో అతనికి తెలియదు. చివరకు ఈ బైక్ ను భరించలేక భార్య పిల్లలతో సహా ఆ కంపెనీ షోరూమ్ ముందు ఆందోళనకు దిగారు. బైక్ ప్ల కార్డు పెట్టి ఇంటిల్లిపాదీ ధర్నా చేశారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. నెటిజన్లు బాధిత కుటుంబానికి సపోర్ట్ గా సదరు కంపెనీకి వ్యతిరేకంగా కామెంట్లు పెడుతున్నారు.