హోండా కార్లపై అదిరిపోయే డిస్కౌంట్.. - MicTv.in - Telugu News
mictv telugu

హోండా కార్లపై అదిరిపోయే డిస్కౌంట్..

May 17, 2019

కారు కొనాలనుకునేవారికి శుభవార్త.. ప్రముఖ వాహన తయారీ కంపెనీ హోండా కార్స్ పలు మోడళ్లపై బంపర్ ఆఫర్ ప్రకటించింది. వెయ్యి కాదు, రెండు వేలు కాదు.. ఏకంగా రూ. లక్ష వరకు డిస్కౌంట్ ఇస్తోంది.

Honda Cars Available With Benefits Of Upto Rs 1 Lakh.

హోండా కంపెనీకి చెందిన హోండా బీఆర్-వీ మోడల్‌పై వివిధ రూపాల్లో దాదాపు రూ.లక్ష వరకు డిస్కౌంట్ ఇస్తోంది. సెవెన్ సీట్ ఎంపీవీ కారుపై రూ.50,000 వరకు ఎక్స్చేంజ్ బోనస్ లభిస్తోంది. అంతేకాదు రూ.1కే ఇన్సూరెన్స్ కూడా చేసిస్తున్నారు. అలాగే హోండా జాజ్ మోడల్‌పై రూ.40,000 వరకు ఆఫర్ ఉంది. ఈ కారుపై రూ.25,000 ఇన్సూరెన్స్ డిస్కౌంట్, రూ.15,000 ఎక్స్చేంజ్ బోనస్ లభిస్తోంది.

డబ్ల్యూఆర్-వీ కారుపై కూడా ఇలాంటి ఆఫర్లు అందుబాటులో ఉన్నాయి. హోండా అమేజ్ మోడల్‌పై వారంటీ పొడిగింపు లభిస్తోంది. ఇకపోతే హోండా సిటీ కారుపై రూ.52,000 వరకు ప్రయోజనాలు పొందవచ్చు. ఇన్సూరెన్స్, ఎక్స్చేంజ్ బోనస్ రూపంలో ఈ బెనిఫిట్స్ లభిస్తున్నాయి. హోండా బ్రియో కారుపై కస్టమర్లు రూ.19,000 ప్రయోజనాలు పొందొచ్చని కంపెనీ ప్రతినిధులు పేర్కొంటున్నారు.