Honda launched the Dio Sports Scooty in the indian market
mictv telugu

తక్కువ ధరలో హోండా డియో స్పోర్ట్స్.. మార్కెట్లో విడుదల

August 4, 2022

ప్రముఖ ద్విచక్ర వాహన తయారీ సంస్థ హోండా మార్కెట్లో మరో మోడల్ స్కూటీని విడుదల చేసింది. హోండా డియో మోటో స్కూటర్ స్పోర్టీ వెర్షన్‌గా లాంచ్ చేసింది. లిమిటెడ్ ఎడిషన్‌గా తీసుకొచ్చిన ఈ మోడల్ పరిమిత కాలం మాత్రమే అందుబాటులో ఉంటుంది. రెడ్ రియర్ సస్పెన్షన్‌తో తీసుకొచ్చిన ఈ స్కూటీ సిల్వర్ మెటాలిక్, రెడ్ విత్ బ్లాక్ అనే రెండు కలర్ వేరియంట్లలో వస్తుంది. డీలక్స్ వేరియంట్‌లో అల్లాయ్ వీల్స్ అందిస్తుంది. 110 సీసీ ఇంజిన్, టెలిస్కోపిక్ సస్పెన్షన్, పాస్ స్విచ్, ఎక్స్‌టర్నల్ ఫ్యూయల్ లిడ్, ఇంటిగ్రేటెడ్ డ్యూయల్ ఫంక్షన్ స్విచ్, ఇంజిన్ కటాఫ్‌తో కూడిన సైడ్ స్టాండ్ ఇండికేటర్ ప్రధాన ఫీచర్లుగా ఉన్నాయి. ఇంకా కాంబీ బ్రేక్ సిస్టమ్, ఇంధన సామర్ద్యం కోసం 3 స్టెప్ ఎకో ఇండికేటర్ జోడించింది. ఇక ధరల విషయానికి వస్తే.. స్టాండర్డ్ వేరియంట్ ధర రూ. 68,317 (ఎక్స్‌షోరూమ్), టాప్ ఎండ్ డీలక్స్ వేరియంట్ రూ. 73,317, రెగ్యులర్ డియో స్టాండర్డ్ ధర రూ. 73,599, డీలక్స్ ధర రూ. 77,099 గా నిర్ణయించడం విశేషం.