honda-unveils-upcoming-activa-125-h-smart-scooter
mictv telugu

సూపర్ స్మార్ట్ ఫీచర్స్ తో కొత్త హోండా యాక్టివా

March 26, 2023

 honda-unveils-upcoming-activa-125-h-smart-scooter

దేశంలో అత్యధికంగా అమ్ముడుబోయే టూవీలర్ హోండా యాక్టివా.ఇప్పుడు మరో కొత్త అప్ డేట్ ను ఈ సంస్థ ప్రకటించింది.హోండా యాక్టివా 125 హెచ్ స్మార్ట్ పేరిట దీనిని తీసుకువస్తున్నారు.దీని గురించి ఓ టీజర్ ను విడుదల చేసింది.

స్కూటర్లలో హోండా యాక్టివా తిరుగులేనిది. చాలా మంది దీన్ని కొనుక్కోవడానికి ఇంట్రస్ట్ చూపిస్తుంటారు. దీనికి పోటీగా చాలా కంపెనీలు తమ తమ ఉత్పత్తులను ప్రవేశపెట్టినా యాక్టివా ముందు నిలబడలేకపోతున్నాయి. మరో వైపు యాక్టివా తన మోడళ్ళను అప్ గ్రేడ్ చేసుకుంటూ పోతోంది. తాజాగా మార్కెట్లో ఆవిష్కరించిన 6జీ మోడల్ స్కూటర్ లో రిమోట్ కీ లాంటి సూపర్ ఫీచర్లతో తీసుకువస్తోంది. హోండా యాక్టివా 125 హెచ్ స్మార్ట్ పేరిట దీనిని తీసుకురానున్నట్లు ప్రకటించింది. దీనిమీద టీజర్ ను విడుదల చేసింది. కానీ పూర్తి వివరాలను మాత్రం ఇంకా రిలీజ్ చేయలేదు. ఫీచర్లు, డిజైన్ లాంటివి ఇంకా ప్రకటించాల్సి ఉంది.

హోండా యాక్టివా 125హెచ్ స్మార్ట్ స్కూటర్ కూడా ఇటీవల విడుదలైన 6జీ స్కూటర్ కు దగ్గరగానే ఉండే అవకాశం ఉంది. కొత్త బైక్ లో కూడా ఎలక్ట్రానిక్ కీ, పుష్ బటన్ స్టార్ట్ వంటి ఫీచర్స్ తో పాటు పార్క్ చేసిన బైక్ ని కనుగొనేందుకు వీలుగా సిగ్నల్ ఇండికేటర్స్ ఫ్లాష్ అయ్యేలా కొత్త ఫీచర్ తీసుకొచ్చారు.

ధర విషయానికి వస్తే ప్రస్తుతం ఉన్న ధరకు దాదాపు రూ. 10,000 నుంచి రూ. 15,000 వరకూ ఎక్కువ ఉండే అవకాశం ఉంది. ప్రస్తుతం కంపెనీ మూడు రకాల వేరియేషన్లలో యాక్టివాను అందుబాటులో ఉంచుతోంది. యాక్టివా 125 డ్రమ్ మోడల్ రూ. 77,743 నుంచి ఉంది. అలాగే యాక్టివా 125 డ్రమ్ అల్లాయ్ రూ. 81,411 నుంచి ప్రారంభమవుతుంది. అలాగే యాక్టివా 125 డిస్క్ బ్రేక్ 81,611 నుంచి 84,916 వరకూ ఉంది.