Honey bee life span have dropped 50percent in 50 years
mictv telugu

తేనె బతుకు.. సగానికి తగ్గిపోయింది!

November 15, 2022

honey, life span, research, bee, science, future

మనిషి జీవితకాలమే తగ్గిపోతోందని ఇన్ని రోజులు అనుకున్నాం. కానీ ఈ లిస్టులోకి ఇప్పుడు తేనెటీగలు కూడా వచ్చి చేరాయి. 50 యేండ్లలో వీటి జీవితకాలం 50శాతానికి తగ్గినట్లు కొన్ని పరిశోధనలు చెబుతున్నాయి. తేనె ఆరోగ్యానికి ఎంతో మంచిదంటారు డాక్టర్లు. అధిక కొవ్వును, రక్తపోటును కూడా నియంత్రించే గుణం ఈ తేనెకు ఉంటుందంటారు. మరికొన్ని రోజుల్లో ఈ తేనె దొరక్కుండా పోతుందట. అవును మీరు వింటున్నది నిజంగా నిజం. ఒకప్పుడు ఎంతో సహజ సిద్ధంగా దొరికే తేనె ఇప్పుడు పంజరాల మధ్య చిక్కుకుంది. స్వేచ్ఛగా విహరించే తేనెటీగలు.. పంజరాల్లోని కాలనీలకు పరిమితమయ్యాయి. అయితే ఇవి ఒకప్పుడు తేనె ఉత్పత్తిని బాగానే ఇచ్చేవి. పైగా వాటి జీవితకాలం కూడా బాగానే ఉండేది. కానీ ఇప్పుడే పరిస్థితి మొత్తం తలకిందులైంది.

పరాగ సంపర్కాల్లో తేనెటీగలు భూమి వాతావరణంలో అస్థిరమైన మార్పులను కొనసాగించడానికి చాలా కష్టపడుతున్నట్లు శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఇది ఇలాగే కొనసాగితే మన ఆహార భద్రత విషయంలో, పర్యావరణ వ్యవస్థలపై ఎంతో ప్రభావం చూపక మానదు. మేరీల్యాండ్ విశ్వవిద్యాలయంలోని కీటక శాస్త్రవేత్తలు నియంత్రిత, ప్రయోగశాల వాతావరణంలో ఉంచబడిన తేనెటీగల జీవితకాలాన్ని అధ్యయనం చేశారు. వాటి జీవితకాలం 1970లలో ఉన్న దానికంటే 50% తక్కువగా ఉందని కనుగొన్నారు.

honey, life span, research, bee, science, future

బయట ఉండే తేనెటీగలతో పోలిస్తే.. కాలనీల్లో పెంచే తేనెటీగలకు ఈ ముప్పు ఎక్కువ అంటున్నారు. దీనివల్ల తేనె ఉత్పత్తి తగ్గుతుంది. యూఎస్లో ఇప్పటికే ఈ పరిస్థితి ఉందని అక్కడి తేనెటీగల పెంపకందారులు చెబుతున్నారు. వీటి పెంపకం వల్ల అధిక నష్టాలు వస్తున్నట్టుగా చెబుతున్నారు. పర్యావరణ కాలుష్యం వీటి జీవితకాలంపై అధిక పాత్ర పోషిస్తుందని సైంటిఫిక్ రిపోర్ట్స్ కూడా చెబుతున్నాయి. ‘మనం కొన్ని జన్యుపరమైన కారకాలను వేరు చేయగలిగితే, మనం ఎక్కువ కాలం జీవించే తేనెటీగలను పెంచుకోవచ్చు’ అని నియర్‌మాన్ అనే అధ్యయనకర్త చెబుతున్నాడు. నియంత్రిత వాతావరణంలో తేనెటీగల ఆహారాన్ని మార్చడం వాటి జీవితకాలంపై ఎలాంటి ప్రభావం చూపదని కూడా ఆయన అంటున్నాడు. అయితే 1970 కాలంలో 34.3రోజులు తేనెటీగలు బతికి ఉన్నాయి. ఇప్పుడు 17.7 రోజులకు వాటి జీవితకాలం పడిపోయింది. ఇది ఇలాగే కొనసాగితే మనకు తేనె దొరకడం కష్టంగా మారిపోతుంది.