చైనాకు షాక్.. డ్రాగన్స్‌పై హాంకాంగ్ ఘన విజయం - MicTv.in - Telugu News
mictv telugu

చైనాకు షాక్.. డ్రాగన్స్‌పై హాంకాంగ్ ఘన విజయం

November 26, 2019

హాంకాంగ్‌లో జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో చైనాకు ఘోర పరాభావం ఎదురైంది. ఆ దేశ నియంత్రృత్వాన్ని కొంత కాలంగా వ్యతిరేకిస్తున్న హాంకాంగ్ ప్రజలు ప్రజాస్వమ్యా అనుకూలవాదులకే పట్టం కట్టారు. చైనా ఆధిపత్యాన్ని కోరుకుంటున్న వారిని మట్టికరిపించారు. మొత్తం 18 జిల్లాల్లోని 452 స్థానాల్లో 388 మంది ప్రజాస్వామ్య అనుకూలవాదులు గెలిచారు. చైనా ప్రభుత్వానికి అనుకూలంగా ఉన్న వారిలో కేవలం  59 మంది మాత్రమే విజయం సాధించగా మరో ఐదుగురు స్వతంత్రులు గెలిచారు.

Hong Kong Elections.

కొంత కాలంగా హాంకాంగ్ ప్రజలు తమ చైనా నియంతృత్వాన్ని వ్యతిరేకిస్తున్నారు. దీని కారణంగా కొన్ని రోజులుగా అక్కడ నిరసన జ్వాలలు రిగిలాయి. చైనా ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ సమయంలో జరిగిన ఎన్నికల్లో చైనా అనుకూల పార్టీకి చెందిన  155 మంది ఓడిపోయారు. అయితే, హాంకాంగ్‌ చీఫ్‌ ఎగ్జిక్యూటివ్‌ను ఎన్నుకునే 1,200 మందితో కూడిన ఎలక్టోరల్‌ కాలేజీ మాత్రం ఇంకా చైనా ప్రభుత్వం నియంత్రణలోనే ఉంది. 

అక్కడ చైనా చెప్పిన మాటే నెగ్గే అవకాశం ఉంది. దీంతో ఆ దేశ ప్రభుత్వానికి అనుకూలంగా ఉన్నవారే చీఫ్ ఎగ్జిక్యూటీవ్ అయ్యే అవకాశం ఉంది. ఏది ఏమైనా హాకాంగ్ ప్రజల వాయిస్ బలంగా వినిపించేదుకు మాత్రం కావాల్సినంత మంది ప్రతినిధులు తాజా విజయంపై అక్కడి ప్రజలు సంబరాలు చేసుకున్నారు. త్వరలోనే చైనా నుంచి పూర్తిగా విముక్తి పొందుతామని వ్యాఖ్యానిస్తున్నారు. కాగా హాంకాంగ్‌లో నిరసనకారులను అణిచివేసే చర్యలను చైనా ప్రభుత్వం ప్రారంభించింది.