కాసింత పార్కింగ్ స్థలానికి  7 కోట్లు..  - MicTv.in - Telugu News
mictv telugu

కాసింత పార్కింగ్ స్థలానికి  7 కోట్లు.. 

October 26, 2019

Hong Kong Parking Space Sold for 7 Cors

సాధారణంగా కారు పార్కింగ్ చేసేందుకు స్థలం కొనాలంటే కొన్ని వేల రూపాయలు ఖర్చు చేస్తే సరిపోతుంది. కానీ హాంకాంగ్‌లో మాత్రమే ఓ వ్యక్తి ఏకంగా రూ. 7 కోట్లు ఖర్చు చేశాడు. అది  కూడా కేవలం 135 చదరపు అడుగుల స్థలానికే ఇంత డబ్బు ఖర్చు పెట్టాడు. ఈ వార్త తెలిసిన వారంతా ఆశ్చర్యపోతున్నారు.సెంట్రల్ ఆఫీస్ టవర్లలో చాలా వరకు కారు పార్కింగ్ స్థలాలు అమ్మకానికి లేవు. కాబట్టి ఎవరైనా స్థలం కొనాలంటే అత్యధిక ధర వెచ్చించాల్సిందే. కానీ ఇంత పెద్ద ఎత్తున చెల్లించడం మాత్రం ఇదే ప్రథమని అక్కడి వారు చెబుతున్నారు.

అత్యధిక జనాభా.. ఆకాశ హర్మ్యాలకు హంకాంగ్ ప్రసిద్ధిగాంచింది. అక్కడ చిన్నపాటి స్థలం కొనాలంటే లెక్కకు మంచిన భారమే. కానీ ఓ వ్యక్తి  ఏకంగా తన కారు పార్కింగ్ కోట్ల రూపాయలు వెచ్చించాడు. జానీ చేయుంగ్ అనే వ్యాపారి ఈ స్థలాన్ని అతనికి అమ్మినట్టు తెలుస్తోంది. ఆ స్థలాన్ని కొనుగోలు చేసిన వ్యక్తి ఆఫీసు అదే బిల్డింగ్‌లో ఉంటంతో అంత ఖర్చు చేసినట్టుగా చెబుతున్నారు. సాధారణంగా అక్కడ పలికే ధర కంటే మూడు రేట్లు ఎక్కువగా అక్కడి రియల్ ఎస్టేట్ వ్యాపారులు చెబుతున్నారు.  ఇంత చిన్న స్థలానికి అంత ధరపెట్టడం బహుశా ప్రపంచంలోనే ఇదే ప్రథమమని వారు అభిప్రాయపడుతున్నారు. 

2017లో అక్కడి ప్రభుత్వం నిర్వహించిన ఓ సర్వేలో ప్రతి ఐదు కుటుంబాల్లో ఒక కుటుంబం దారిద్య్రరేఖకు దిగువన ఉన్నట్టు వెల్లడైంది. దీంతో పాటు అక్కడ తరుచూ రాజకీయ అస్థిరత, సంక్షోభ పరిస్థితులు వస్తూనే ఉంటాయి. అలాంటి నగరంలో  ఒక వ్యక్తి కారు పార్కింగ్ కోసం ఇంత పెద్ద ఎత్తున ఖర్చు చేయడాన్ని చూస్తే అక్కడి ప్రజల మధ్య సంపధ అంతరం ఎంతగా ఉందో అర్థం చేసుకోవచ్చని ఇది తెలిసిన వారు వ్యాఖ్యానిస్తున్నారు.