టెక్ ప్రపంచంలో ఇప్పుడు చాట్‌జీపీటీ హాట్ టాపిక్‌గా మారింది. నైతిక అభ్యంతరాలు, కాపీరైట్ ఉల్లంఘన ఆరోపణలు ఎన్ని ఉన్నా విద్యార్ధుల అభ్యసనా సామర్ధ్యాన్ని ఇది దెబ్బతీస్తుందనే ఆందోళనలు నెలకొన్నాయి. ఈ నేపథ్యంలో కృత్రిమ మేధ ఆధారిత చాట్‌జీపీటీని ఇప్పటికే బెంగళూరులోని ఆర్వీ విశ్వవిద్యాలయం, న్యూయార్క్ ఎడ్యుకేషన్ బోర్డు నిషేధించాయి. తాజాగా ఇది మరో యూనివర్సిటీకి పాకింది. చాట్‌జీపీటీని నిషేధిస్తూ యూనివర్సిటీ ఆఫ్ హాంకాంగ్ ఆదేశాలు జారీ చేసింది.
స్టూడెంట్లు కూడా అసైన్‌మెంట్లను చాట్‌జీపీటీ సాయంతో చేయవద్దని హెచ్చరించింది. అటు ప్రొఫెసర్లు కూడా వాడవద్దని స్పష్టం చేసింది. అనుమతి లేకుండా వాడితే నిబంధనల ప్రకారం చర్యలు తీసుకుంటామనిఇంఛార్జ్ హీ లిరెన్ ప్రకటించారు. ఎవరైనా విద్యార్ధి అసైన్‌మెంట్లకు చాట్‌జీపీటీని వాడితే ఇంటర్వ్యూ ద్వారా అతని సామర్ధ్యాన్ని తెలుసుకోవచ్చని ప్రొఫెసర్లకు సూచనలు ఇచ్చారు.