Honkong Model : police found missing skull in soup bowl
mictv telugu

క్రైమ్ థ్రిల్లర్ ను తలపిస్తున్న రియల్ సీన్.. హాంకాంగ్ మోడల్ దారుణ హత్య

March 1, 2023

Honkong Model : police found missing skull in soup bowl

Honkong Model : మహిళలపై దాడులు, దారుణాలు, ఆక౹త్యాలు రోజు రోజుకు పెరిగిపోతూనే ఉన్నాయి. ఇండియాలోనే కాదు వరల్డ్ వైడ్ గా మగువలు, పురుషుల దాడులకు బలైపోతూనే ఉన్నారు. సామాన్య మహిళల నుంచి సెలబ్రిటీల వరకు అందరూ మానవ మృగాల చేతుల్లో చిక్కి తమ నిండు నూరేళ్ళ జీవతాన్ని కోల్పోతున్నారు. ఈ మధ్యనే దేశ రాజధాని ఢిల్లీలో శ్రద్ధా వాకర్ కేస్ ఎలాంటి భయాందోళను రేకెత్తించిందో అందరికి తెలిసిందే. ప్రేమించిన అమ్మాయినే అడ్డుతొలగించుకునేందుకు అత్యంత కిరాతకంగా ఆమెను హతమార్చాడు ప్రియుడు. శ్రద్ధాను చంపి ఆమె ఆనవాళ్ళు లేకుండా చేసేందుకు ఆమె శరీరాన్ని భాగాలుగా నరికి అడవుల్లో పడేశాడు. ఇదే సీన్ హాంకాంగ్ లోనూ రిపీట్ అయ్యింది. హాంకాంగ్ మోడల్ ను చంపి ఆమె శరీర భాగాలను నరికి ఫ్రిజ్ లో దాచిపెట్టాడు ఓ హంతకుడు. భయంకరమైన ఈ ఘటన ప్రపంచమంతా నివ్వెరపోయేలా చేసింది.

హాంకాంగ్‌కు చెందిన 28 ఏళ్ల మోడల్, ఇన్‌ఫ్లుయెన్సర్ అయిన అబ్బి చోయ్ గత మంగళవారం అదృశ్యమయ్యింది. రెండు రోజుల తర్వాత నగరంలోని తై పో జిల్లాలోని ఓ ఇంట్లోని ఫ్రిజ్‌లో ఆమె ఛిద్రమైన శరీర భాగాలను పోలీసులు జరిపిన తనిఖీల్లో గుర్తించారు . అధికారులు తెలిపిన వివరాల ప్రకారం మోడల్ ఇంట్లో వుడ్ కట్టర్ తో పాటు మీట్ స్లైసర్ , కొన్ని దుస్తులు కూడా కనిపించాయి. అయితే, ఆమె తల, మొండెం, చేతులు ఈ తనిఖీల్లో కనిపించలేదు. దీంతో ఇళ్లంతా జల్లెడ పట్టిన పోలీసులు ఓ సూప్ పాట్ తో పాటు రెండు పెద్ద కుండలలో మోడల్ తలను , మానవ అవశేషాలను కనుగొన్నారని న్యూయార్క్ పోస్ట్ నివేదించింది.

ఈ కేసును దర్యాప్తు చేస్తున్న సూపరింటెండెంట్ అలాన్ చుంగ్ అక్కడి మీడియాతో మాట్లాడిన మాటలు చాలా భయానకంగా ఉన్నాయి. మోడల్ తలపై చర్మం లేదని మాంసం కూడా లేదని, ఆమె పుర్రె మాత్రమే మిగిలిందని అది క కూడా క్యారెట్ ముల్లంగి పదార్ధాలతో చేసిన ద్రవంలో దానిని ముంచినట్లు తెలిపారు. పుర్రెల లభించిన కుండ పై భాగం వరకు సూప్ ఉందని చెప్పారు. అయితే క్యారెట్లు, ముల్లంగితో పాటుగా ఇతర మాంసం ముక్కలు , ఫ్యాట్ సూప్ లో ఉన్నాయని అవి బహుషా మానవ అవశేషాలు అయి ఉంటాయని మేము అనుకుంటున్నామన్నారు. మోడల్ తల దొరికినా దానిపై స్కిన్ లేదు, కాబట్టి, ప్రాథమికంగా, జుట్టు, పుర్రె ను పరిశీలిస్తామని సూపరింటెండెంట్ తెలిపారు.

ఫోరెన్సిక్ పరీక్షలో పుర్రె వెనుక భాగంలో ఒక రంధ్రం కనిపించింది, దీంతో మోడల్ పై ముందే కారులో దాడి జరిగి ఉంటుందని, ఆపై ఆమె అపస్మారక స్థితిలో ఉన్నప్పుడు ఇంటికి తీసుకెళ్లి ఉండవచ్చని పోలీసులు భావిస్తున్నారు. మరోవైపు ఈ దారుణ హత్యకు సంబంధించి హాంకాంగ్ పోలీసులు నలుగురిని అదుపులోకి తీసుకున్నారు. చోయ్ హత్యకు పాల్పడిన వారిలో ఆమె మాజీ భర్త అలెక్స్ క్వాంగ్, అతని తండ్రి క్వాంగ్ కౌ , సోదరుడు ఆంథోనీ క్వాంగ్ ఉన్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. పోలీసుల కథనాల ప్రకారం, శ్రీమతి చోయికి తన మాజీ భర్తకు పది మిలియన్ల హాంకాంగ్ డాలర్లతో కూడిన విలాసవంతమైన ఆస్తికి సంబంధించిన వివాదాలు ఉన్నాయి.