హానర్ 10ఎక్స్ లైట్ వచ్చేసింది.. ధర, ఫీచర్లు - MicTv.in - Telugu News
mictv telugu

హానర్ 10ఎక్స్ లైట్ వచ్చేసింది.. ధర, ఫీచర్లు

October 31, 2020

Honor 10X Lite is a new mid-range smartphone

ప్రముఖ స్మార్ట్ ఫోన్ బ్రాండ్ హానర్ కొత్త ఫోన్ హానర్ 10ఎక్స్ లైట్‌ను లాంచ్ చేసింది. ఈ ఫోన్ ప్రస్తుతానికి సౌదీ అరేబియాలో లాంచ్ అయింది. త్వరలో భారత మార్కెట్‌లో విడుదల కానుంది. దీని ధరను సోదిలో 799 సౌదీ రియాళ్లుగా (భారత కరెన్సీలో రూ.15,900) నిర్ణయించారు. ఈ ఫోన్ మిడ్ నైట్ బ్లాక్, ఐస్‌ల్యాండిక్ ఫ్రాస్ట్, ఎమరాల్డ్ గ్రీన్ రంగుల్లో లభ్యం కానుంది. ఇందులో సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్ అందించారు.

హానర్ 10ఎక్స్ లైట్‌ ఫీచర్లు

* కిరిన్ 710 ప్రాసెసర్, 

* 48+8+2+2 క్వాడ్ రేర్ కెమెరా సెటప్,

* 8 మెగా పిక్సెల్ సెల్ఫీ కెమెరా,

* 4 జీబీ ర్యామ్ + 128 జీబీ స్టోరేజ్, 

* 6.67 అంగుళాల ఫుల్‌హెచ్‌డీ+ ఎల్సీడీ డిస్ ప్లే,

* 5000 ఎంఏహెచ్‌ బ్యాటరీ, 

* ఆండ్రాయిడ్ 10 ఆపరేటింగ్ సిస్టం.