హానర్‌ నుంచి మరో అద్భుతమైన స్మార్ట్‌ఫోన్‌ - MicTv.in - Telugu News
mictv telugu

హానర్‌ నుంచి మరో అద్భుతమైన స్మార్ట్‌ఫోన్‌

October 24, 2019

Honor  .

చైనా స్మార్ట్‌ఫోన్ తయారీ సంస్థ హానర్ మరో కొత్త అద్భుతమైన ఫోన్‌ను విడుదల చేసింది. హానర్ 20 సిరీస్‌లో భాగంగా హానర్ 20 లైట్‌ను బుధవారం చైనా మార్కెట్లో విడుదల చేసింది. ఈ ఫోన్ మరి కొన్ని నెలల్లో భారతీయ మార్కెట్లో విడుదల కానుంది. 4,6,8 జీబీ ర్యాంతో మొత్తం నాలుగు ఇంటర్నల్ స్టోరేజ్ వేరియంట్లుగా ఈ స్మార్ట్‌ఫోన్లు అందుబాటులోకి రానున్నాయి. బ్లాక్, గ్రీన్, బ్లూ-పింక్ గ్రేడియంట్ రంగుల్లో లభించనున్నాయి. చైనాలో ఈ ఫోన్ అమ్మకాలు అక్టోబర్ 25 నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ ఫోన్ ధర భారత మార్కెట్లో దాదాపు రూ.14వేల రూపాయల నుంచి ప్రారంభం కానున్నట్లు సమాచారం.

హానర్ 20 లైట్ ఫీచర్లు

* 6.3 అంగుళాల ఓఎల్ఈడీ డిస్‌ప్లే,

* 2400 × 1080 డిస్ ప్లే రిజల్యూషన్,

* కిరిన్ 710F ప్రాసెసర్‌,

* ఆండ్రాయిడ్ 9 పై ఆపరేటింగ్ సిస్టం,

* 16 ఎంపీ సెల్పీకెమెరా,

* 48+8+2 ఎంపీ అల్ట్రా వైడ్ రియర్ ట్రిపుల్ కెమెరా,  

* 4,000 ఎంఏహెచ్ బ్యాటరీ,

* వాటర్ డ్రాప్ నాచ్,

* ఇన్ డిస్ ప్లే ఫింగర్ ప్రింట్.