హానర్ నుంచి తొలి ల్యాప్‌టాప్.. 3 వేలు తగ్గింపు - MicTv.in - Telugu News
mictv telugu

హానర్ నుంచి తొలి ల్యాప్‌టాప్.. 3 వేలు తగ్గింపు

July 31, 2020

Dog tries playing Fetch with statue in viral video. So cute, says Internet.221

కరోనా సమయంలో ల్యాప్‌టాప్‌లకు బాగా గిరాకీ పెరిగింది. చాలా సంస్థల ఉద్యోగులు ఇళ్ల నుంచే పనులు చేయడంతో ల్యాప్‌టాప్‌ల విక్రయం ఊపందుకుంది. ఈ క్రమంలో స్మార్ట్‌ఫోన్లకే పరిమతం అయిన హానర్ ల్యాప్‌టాప్‌ల విభాగంలోకి వచ్చింది. ‘హానర్‌ మ్యాజిక్‌ బుక్‌ 15’ పేరుతో శుక్రవారం తన తొలి ల్యాపటాప్‌ను భారత్‌లో లాంచ్‌ చేసింది. ఫుల్‌ హెచ్‌డీ డిస్‌ప్లే, ఏఎంబీ రైజెన్‌ 3000 సిరీస్ సీపీయూలు,  వేగా గ్రాఫిక్‌  లాంటి ఫీచర్లు ఉన్న దీని విండోస్‌ ముందే ఇన్‌స్టాల్  చేశారు. ఒకే రంగులో ప్రస్తుతం దీనిని అందిస్తున్నారు. ఆగస్టు మొదటి వారం నుంచి అమ్మకాలు ప్రారంభించనున్నారు. లాంచింగ్‌ ఆఫర్‌గా రూ.3 తగ్గింపు ధరతో అందిస్తోంది హానర్.  


మిస్టిక్ సిల్వర్ కలర్‌‌లో ఉన్న హానర్ మ్యాజిక్‌ బుక్‌ 15  ధర  రూ.42,990గా నిర్ధారించారు. ఆగస్టు 6న ఉదయం 12 గంటల నుంచి ఫ్లిప్‌కార్ట్‌లో అందుబాటులో ఉంటుంది. ప్రారంభ ఆఫర్‌గా రూ.3 వేలు తగ్గింపుతో రూ. 39,990 రూపాయలకే అందిస్తున్నారు. అలాగే వీడియోలను నిరంతరం చూసినా  బ్యాటరీ సమయం 6.3 గంటలు ఉంటుందని కంపెనీ ప్రకటించింది. 

హానర్ మ్యాజిక్‌ బుక్‌15 ఫీచర్లు ఇలా.. 

-విండోస్ 10 హోమ్ (ప్రీ లోడెడ్‌) 
-15.6-అంగుళాల  ఫుల్‌ హెచ్‌డీ ఐపీఎస్ డిస్‌ప్లే
-1920×1080 పిక్సెల్స్ 87 శాతం స్క్రీన్ టు బాడీ రేషియో

-యూటీవీ రీన్‌ల్యాండ్ సర్టిఫికేషన్ 
– 8 జీబీ ర్యామ్‌, 256జీబీ స్టోరేజ్‌ (టైప్-సీ పోర్ట్‌)

-65 వాట్స్ చార్జర్‌ (కేవలం 30 నిమిషాల్లో 50 శాతం చార్జ్ ‌అవుతుంది)

-సెక్యూరిటీ కోసం టూ-ఇన్-వన్ ఫింగర్‌ ప్రింట్‌ పవర్‌ బటన్‌  

-పాప్-అప్ వెబ్‌ క్యామ్‌

-వై-ఫై, బ్లూటూత్, ఎన్‌ఎఫ్‌సీ, యుఎస్‌బీ 2.0, యుఎస్‌బీ 3.0, హెచ్‌డీఎంఐ పోర్ట్, 3.5ఎంఎం హెడ్‌ఫోన్ జాక్‌ వంటి ప్రత్యేకమైన ఫీచర్లు ఈ ల్యాప్‌టాప్ సొంతం.