హానర్‌ నుంచి 5జీ స్మార్ట్‌ఫోన్లు విడుదల - MicTv.in - Telugu News
mictv telugu

హానర్‌ నుంచి 5జీ స్మార్ట్‌ఫోన్లు విడుదల

November 27, 2019

Honor V30, Honor V30 Pro With Dual-Mode 5G Support Launched

ప్రముఖ స్మార్ట్‌ఫోన్ తయారీ సంస్థ హానర్‌ 5జి ఫోన్లను చైనాలో విడుదల చేసింది. వ్యూ 30 సిరీస్‌లో మొదటి డ్యూయల్ మోడ్ 5జి స్మార్ట్‌ఫోన‍్లను మంగళవారం ఆవిష్కరించింది. వ్యూ 30, వ్యూ 30 ప్రో పేరుతో విడుదల చేసిన ఈ ఫోన్‌లలో 5జీ/4జీ డ్యూయల్ మోడ్‌ను అమర్చింది. వ్యూ 30 6జీబీ ర్యామ్ / 128 జీబీ స్టోరేజ్ ,  8జీబీ ర్యామ్ / 128జీబీ స్టోరేజ్ ఆప్షన్లలో లభించేనుంది. వీటి ధరలు సుమారు రూ. 33,600, 37,700 ఉండనున్నాయి. వ్యూ 30 ప్రో 8జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజ్ ధర సుమారు రూ.39,700, 256 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర సుమారు రూ.42,800 ఉండనుంది.

 

వ్యూ 30 ప్రో  ఫీచర్లు

* 6.57-అంగుళాల ఎఫ్‌హెచ్‌డి+ఫుల్‌వ్యూ డిస్‌ప్లే,

* 7ఎన్ఎమ్ ప్రాసెస్-బేస్డ్ కిరిన్ 990 చిప్‌సెట్‌,

* ఆండ్రాయిడ్ 10 ఆపరేటింగ్ సిస్టం,

* 40+12+8 ఎంపీ ట్రిపుల్‌ రేర్ కెమెరా,

* 32+8 ఎంపీ డ్యూయల్ సెల్ఫీ కెమెరా,

* 4100 ఎంఏహెచ్ బ్యాటరీ.