హానర్ ఎక్స్ 10 మార్కెట్లోకి..ఫీచర్లు ఇవే
టెక్నాలజీ రోజురోజుకీ కొత్త పుంతలు తొక్కుతోంది. ఇన్ని రోజులు 4జీ ఫోన్లను తయారు చేసిన కంపెనీలు తాజాగా 5జీ ఫోన్లను విడుదల చేస్తున్నాయి. ఇప్పటికే రెడీమి కంపెనీ తన మొదటి 5జీ ఫోన్ ను విడుదల చేసిన సంగతి తెల్సిందే. తాజాగా హానర్ సంస్థ 'హానర్ ఎక్స్ 10' పేరుతో ఈరోజు చైనా మార్కెట్ లో 5జీ స్మార్ట్‌ఫోన్‌ను విడుదల చేసింది.
ఈ ఫోన్ లో 5జీ, ట్రిపుల్ రియర్ కెమెరా, పాప్ అప్ సెల్పీ కెమెరా, ఆక్టా-కోర్ ప్రాసెసర్ లాంటి ఫీచర్లు ఉన్నాయి. చైనా మార్కెట్లో మే 26 నుండి ఈ ఫోన్ సేల్ కానుంది. మిగతా దేశాల్లో ఎప్పుడు విడుదల చేసేది ఇంకా ప్రకటించలేదు. ఇక ఫోన్ ధర విషయానికి వస్తే.. 6 జీబీ, 64 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర సుమారు రూ. 20,200గా నిర్ణయించారు. అలాగే 6 జీబీ, 128 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర సుమారు రూ. 23,400 ఉండనుంది. అలాగే 8 జీబీ, 128 జీబీ స్టోరేజ్ వేరియంట్, ధర రూ .25,500 ఉండనుందని అంచనా.
హానర్ ఎక్స్ 10 ఫీచర్లు
* 6.63 అంగుళాల డిస్‌ప్లే,
* హై సిలికాన్ కిరిన్ 820 ప్రాసెసర్,
* ఆండ్రాయిడ్ 10 ఆపరేటింగ్ సిస్టం,
* 16 ఎంపీ సెల్పీ పాప్ అప్ కెమెరా,
* 40+8+2 ఎంపీ ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్,
* 4300 ఎంఏహెచ్ బ్యాటరీ.