హానర్ నుంచి 5జీ స్మార్ట్ ఫోన్..ధర ఎంతంటే? - MicTv.in - Telugu News
mictv telugu

హానర్ నుంచి 5జీ స్మార్ట్ ఫోన్..ధర ఎంతంటే?

February 25, 2020

Honor

చైనాకు చెందిన ప్రముఖ స్మార్ట్‌ఫోన్ తయారీ సంస్థ హానర్.. వ్యూ30 స్మార్ట్‌ఫోన్‌ను విడుదల చేసింది. ఇది 5జీ ఫోన్ కావడం విశేషం. ఈ ఫోన్ బేస్ వేరియంట్ అయిన 8 జీబీ ర్యామ్ + 128 జీబీ స్టోరేజ్ ధర చైనాలో 3,899 యువాన్లుగా (మన కరెన్సీలో సుమారు రూ.39,000) ఉంది. ఈ ఫోన్ 40W ఫాస్ట్ చార్జింగ్‌కు సపోర్ట్ చేస్తుంది. ఇందులో 5జీ, 4జీ వోల్టే, వైఫై, జీపీఎస్/ఏ-జీపీఎస్, బ్లూటూత్ 5.1, యూఎస్ బీ టైప్-సీ పోర్టు, ఎన్ఎఫ్ సీ వంటి ఫీచర్లు ఇందులో ఉన్నాయి.

 

హానర్ వ్యూ 30 ప్రో ఫీచర్లు

 

* 6.57 అంగుళాల ఫుల్ హెచ్ డీ+ డిస్ ప్లే,

* హైసిలికాన్ కిరిన్ 990 ప్రాసెసర్, 

* ఆండ్రాయిడ్ 10 ఆపరేటింగ్ సిస్టం,

* 8 జీబీ ర్యామ్, 128 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్,

* 40+8+12 మెగా పిక్సెల్ ట్రిపుల్ కెమెరా సెటప్, 

* 32+8 మెగా పిక్సెల్ డ్యూయెల్ సెల్ఫీ కెమెరా సెటప్,

* 4,100 ఎంఏహెచ్ బ్యాటరీ.