మరో పరువు హత్య.. హిందూ యవకుడి కాల్చివేత - MicTv.in - Telugu News
mictv telugu

మరో పరువు హత్య.. హిందూ యవకుడి కాల్చివేత

October 1, 2018

పరువు ప్రతిష్ట, కులమతాల పేర్లతో ప్రేమికులను కాల్చిచంపడం దేశంలో రోజురోజుకు రివాజుగా మారుతోంది. తమ పిల్లను తమ కులం వాడు, మతం వాడు తప్ప మరొకడుపెళ్లాడ్డానికి వీల్లేదంటూ కొందరు దారుణ నేరాలకు పాల్పడుతున్నారు. ఒక హిందూ ఉపాధ్యాయుడు తన సోదరిని ప్రేమించడాన్ని జీర్ణించుకోలేని ఓ ముస్లిం.. అతణ్ని పట్టపగలు కాల్చిచంపాడు.

Teacher shot dead at Delhi’s Mahendra Park New Delhi, Police investigating the case girl brother angry over her interfaith love

దేశ రాజధాని ఢిల్లీలోని మహేంద్ర పార్కులో ఈ సోమవారం ఉదయం ఈ దారుణం జరిగింది. అంకిత్ గార్గ్ అనే స్థానిక యువకుడు ట్యూషన్లు చెబుతున్నాడు. అతని వద్ద చదువుకునే ముస్లిం అమ్మాయిని ప్రేమించాడు. ఇద్దరూ పెళ్లి చేసుకోవాలని కూడా అనుకున్నాడు. ఈ విషయం తెలిసిన అమ్మాయి సోదరుడు.. అంకిత్‌ను చాలాసార్లు బెదిరించాడు. సోమవారం మోటార్ బైక్‌పై వెళ్లి అంకిత్‌ను కాల్చిచంపాడు. ఢిల్లీలో గత ఏడాది కూడా ఇలాంటి హత్య జరిగింది. అంకిత్ సక్సేనా అనే హిందూ యువకుడు.. ఓ ముస్లిం యువతిని ప్రేమించినందుకు ఆమె కుటుంబ సభ్యులు గొంతుకోసి చంపారు.