రెండోసారి క్రికెటర్ ఆఫ్ ది ఇయర్‌గా క్వింటన్ డికాక్ - MicTv.in - Telugu News
mictv telugu

రెండోసారి క్రికెటర్ ఆఫ్ ది ఇయర్‌గా క్వింటన్ డికాక్

July 5, 2020

Cricketer.

సౌత్ ఆఫ్రికా క్రికెట్ వార్షిక అవార్డుల ప్రదానోత్సవంలో క్రికెటర్ ఆఫ్ ది ఇయర్‌గా క్వింటన్ డికాక్ ఎంపిక అయ్యాడు. వైట్-బాల్ కెప్టెన్ క్వింటన్ డికాక్ పురుషుల విభాగంలో ‘క్రికెటర్ ఆఫ్ ది ఇయర్’గా ఎంపిక అయ్యాడు. దీంతో పాటు ఈ ఏడాది టెస్టు క్రికెటర్ ఆఫ్ ద ఇయర్‌ కూడా డికాకే దక్కించుకున్నాడు. ఇక మహిళల క్రికెటర్ ఆఫ్ ది ఇయర్, వన్డే క్రికెటర్ ఆఫ్ ది ఇయర్ అవార్డులను యువ ఓపెనర్ లారా వోల్వార్డ్ట్ సొంతం చేసుకుంది. పేసర్ లుంగీ ఎంగిడీ వన్డే, టీ 20 ప్లేయర్‌గా ఎంపిక అయ్యాడు. ఫాన్స్ ఫేవరేట్ ఆటగాడిగా డేవిడ్ మిల్లెర్ ఎంపిక అయ్యాడు. 

కాగా, 2017లో ఈ అవార్డు అందుకున్న డికాక్ పురుల క్రికెటర్ ఆఫ్ ది ఇయర్ అవార్డును రెండోసారి గెలుచుకున్నాడు. 2004లో ప్రారంభించిన ఈ అవార్డు డికాక్‌తో పాటుగా రెండు సార్లు అందుకున్నవారు.. జాక్వెస్ కాలిస్ (2004 , 2011), మఖాయ న్టిని (2005,2006), హాషిం ఆమ్లా (2010,2013), ఏబీ డివిలియర్స్ (2014, 2015), కగిసో రబాడా (2016, 2018)లు వరుసగా రెండుసార్లు ఈ అవార్డును అందుకున్నారు.