చీర అడ్డమని ఎవరన్నారు.. ఎలా ఇరగదీసిందో చూడండి..  - MicTv.in - Telugu News
mictv telugu

చీర అడ్డమని ఎవరన్నారు.. ఎలా ఇరగదీసిందో చూడండి.. 

September 25, 2020

Hoop dance in saree esha kutty talent

భారతీయ మహిళలు చీరకట్టుకు ప్రాధాన్యమిస్తారు. ఉద్యోగినులు, విద్యార్థినులు సౌకర్యం కోసం వేరే దుస్తులు ధరించినా పండగలప్పుడు మాత్రం చీర మెరిసిపోవాల్సిందే. అయితే చీరవల్ల కొన్ని పనులు సరిగ్గా చేయలేరని అంటుంటారు. ముఖ్యంగా క్రీడలు, సాహసాలు నిజంగా కష్టమే. అయితే కొందరు ఆ కష్టాలను కూడా చక్కగా మడతపెట్టేస్తున్నారు. ఇటీవల ఓ అమ్మాయి చీరకట్టుతో జిమ్నాస్టిక్ విన్యాసాలు చేసి అదరగొట్టింది. తాజాగా మరో అమ్మాయి కూడా చీరలో మరో సాహసం చేసింది. నడుముకు రింగ్ వేసుకుని చేసే హూప్ డ్యాన్స్‌లో అమ్మడి టాలెంట్ చూసి ప్రేక్షకులు నోళ్లు వెళ్ల బెడుతున్నారు. 

ఆమె పేరు ఈషా కుట్టీ.  హూప్ డ్యాన్స్‌లో నడుము తిరిగిన కుట్టి వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ‘జెండా పూల్’ పాటకు ఆమె లయ తప్పకుండా డ్యాన్స్ ఇరగదీసింది. ఆమె తల్లి చిత్రానారాయణ్ ఈ వీడియో తీసి పోస్ట్ చేయగా లక్షల మంది చూశారు. #SareeFlow అని హ్యాష్ టాగులు పెట్టి అభినందనలతో ముంచెత్తుతున్నారు.