Hop Shoots Farming in India – Factors, Benefits and Earnings
mictv telugu

ప్రపంచంలోనే అతి ఖరీదైన వెజిటెబుల్ హాప్ షూట్స్!

February 25, 2023

Hop Shoots Farming in India – Factors, Benefits and Earnings

హాప్ షూట్స్.. పుష్కలమైన ఔషధ గుణాలు ఉన్న కూరగాయ. అందుకే అంతర్జాతీయ మార్కెట్ లో కేజీకి దేని ధర రూ.85,000 నుంచి లక్ష వరకు పలుకుతున్నది. మరి ఆ కూరగాయ గురించి తెలుసుకోండి.

హాప్ షూట్స్ కూరగాయ క్యాన్సర్ కణాలతో పోరాడుతుందని నిరూపించబడింది. కాబట్టి భారతదేశంలో ఈ హాప్ రెమ్మల వ్యవసాయం గొప్ప లాభాన్ని పొందగలదు. అసలు ఈ హాప్ రెమ్మలు అంటే ఏమిటి? ఈ కూరగాయల ప్రయోజనాలు, వీటి విత్తనాల గురించి, అధిక దిగుబడినిచ్చే పంటగా ఉన్న దాని గురించి మరింత వివరంగా..

హాప్ షూట్స్ అంటే..

హాఫ్స్ రెమ్మలు కోన్ ఆకారంలో ఉంటాయి. ఆడ హాప్ మొక్కల పువ్వులు ఆకుపచ్చ రంగులో ఉ:టాయి. బీర్, యాంటీబయాటిక్స్, ఇతర ఔషధాల తయారీలో హాప్స్ పండ్లు, కాండం, పువ్వులను ఉపయోగిస్తారు. ఈ మొక్క పుష్పాన్ని స్ట్రోబిల్ లేదా హాప్ కోన్స్ అని పిలుస్తారు. ఇవి చేదుగా ఉంటాయి. వీటిని ఉడకబెట్టి తినవచ్చు. ఆమ్లెట్ లేదా ఇతర వంటకాల్లో కూడా వేసుకోవచ్చు.

పోషకాలు..

ముఖ్యమైన నూనెలు, విటమిన్లు, ఖనిజాలు అధికంగా ఉంటాయి ఇందులో. విటమిన్ ఇ, విటమిన్ బి6, విటమిన్ సి అధికంగా ఉంటాయి. ఇవి యాంటీ ఆక్సిడెంట్ గుణాలను కలిగి ఉంటాయి. రోగనిరోధక వ్యవస్థను మరింత మెరుగు పరుచడానికి ఈ హాప్స్ చాలా ఉపయోగపడుతాయి.

లాభాలు..

– హాప్స్ లో లభించే సహజ నూనెల చర్మంపై బాగా పని చేస్తుంది. ఉపరితల రక్తనాళాలకు విస్తరించి ముఖంపై ఉన్న ఎరుపును తగ్గిస్తాయి.
– జుట్టు రాలకుండా ఉండేందుకు బీర్ ను ఉపయోగించడం మనకు తెలుసు. ఇందులో ఉండే ఆల్కహాలిక్ కంటెంట్ జుట్టు రాలకుండా కాపాడుతుంది.
– కండరాల నొప్పి, పీరియడ్స్ నొప్పిని, నిద్రలేమి సమస్య తగ్గాలంటే ఈ హాప్ ని మీ డైట్ లో తప్పక చేర్చుకోవాలి.
– జీర్ణక్రియ వేగవంతం చేయడానికి ఈ హాప్ మంచి ఔషధంలా పని చేస్తుంది.