భారత్-దక్షిణాఫ్రికా జట్ల మధ్య తాజాగా టీ20 మ్యాచ్‌లు జరుగుతున్న విషయం తెలిసిందే. మొదటి రెండు మ్యాచ్‌ల్లో దారుణంగా విఫలమైన భారత ఆటగాళ్లు.. గత రెండు మ్యాచ్‌ల్లో సమిష్టి ప్రదర్శనతో సత్తాచాటి, సిరీస్‌ను సమం చేశారు. శుక్రవారం జరిగిన నాలుగో టీ20 మ్యాచ్‌లో దక్షిణాఫ్రికా జట్టును 82 పరుగుల తేడాతో చిత్తుగా ఓడించారు. మిడిలార్డర్‌లో వచ్చిన దినేశ్ కార్తీక్, హార్దిక్ పాండ్యాలు మెరుపు ఇన్నింగ్స్‌తో దుమ్మురేపి, క్రికెట్ ప్రియుల ఆశలను సజీవంగా నిలిపారు.
మొదటగా బ్యాటింగ్ చేసిన భారత్.. నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 169 పరుగులు చేసింది. దినేశ్ కార్తీక్ 27 బంతుల్లో 55; 9 ఫోర్లు, 2 సిక్సర్లతో హాఫ్ సెంచరీతో ఆకట్టుకోగా, హార్దిక్ పాండ్యా 31 బంతుల్లో 46; 3 ఫోర్లు, 3 సిక్సర్లతో రాణించాడు. టీ20 మ్యాచ్‌ల్లో సభ్యుడైన దినేశ్ కార్తీక్ పదహారేండ్ల సుదీర్ఘ కెరీర్‌లో తొలి అర్ధశతకం చేశాడు. 10 ఓవర్లు ముగిసేసరికి 56/3తో నిలిచిన భారత్.. ఆ తర్వాత ధాటిగా ఆడింది. కార్తీక్, పాండ్యా దెబ్బకు చివరి ఐదు ఓవర్లలో టీమ్ ఇండియా 73 పరుగులు రాబట్టారు. అనంతరం దీనేష్ కార్తీక్ ‘మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డును సొంతం చేసుకున్నాడు.
అనంతరం బ్యాటింగ్‌కు దిగిన దక్షిణాఫ్రికా ఆటగాళ్లను భారత బౌలర్లు కట్టడి చేశారు. యువ పేసర్ అవేష్ ఖాన్ తన బౌలింగ్‌తో సఫారీలను కకావికలం చేశాడు. కేవలం 18 పరుగులిచ్చి, 4 వికెట్లను పడగొట్టాడు. 170 పరుగుల లక్ష్య ఛేదనలో దక్షిణాఫ్రికా 16.5 ఓవర్లలో 87 పరుగులకే పరిమితమైంది. అవేష్ ఖాన్‌కుతోడు చహల్ (2 వికెట్లు), హర్షల్ పటేల్ (1 వికెట్), అక్షర్ పటేల్ (1 వికెట్) సమయోచితంగా రాణించడంతో టీమిండియా గెలుపుబాటలో నడిచింది.
ఇక, చివరి ఐదో టీ20 మ్యాచ్ ఈ నెల 19న (ఆదివారం) బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో జరగనుంది. ఈ మ్యాచ్ కోసం యావత్ క్రికెట్ ప్రియులు ఎంతోగానో ఎదురుచూస్తున్నారు. రేపు జరగబోయే చివరి మ్యాచ్‌లో భారత్ గెలుస్తుందా? దక్షిణాఫ్రికా గెలుస్తుందా? అనే అంచనాలను ఇప్పటి నుంచే మొదలుపెట్టారు. మొదటి రెండు మ్యాచ్‌ల్లో నిరాశలకు గురి చేసిన భారత్ ఆటగాళ్లు.. మళ్లీ చేలరేగి ఆడటంతో ప్రేక్షకుల ఆశలను సజీవం అయ్యాయి. భారత ఆటగాళ్లే కప్పును గెలుస్తారు అనే విశ్వాసం ప్రేక్షకుల్లో ధృడంగా నాటుకుపోయింది. మరి రేపు బెంగుళూరులో జరిగే మ్యాచ్‌లో భారత బ్యాట్స్‌మెన్స్, బౌలర్లు ఎటువంటి ప్రదర్శన కనబరుస్తారో చూడాలంటే మరికొన్ని గంటలు వేచి ఉండాల్సిందే.