ప్రతి తల్లి తన బిడ్డకు ఏదైనా చిన్న దెబ్బతగిలితేనే అల్లాడిపోతుంది. బిడ్డ పుట్టినప్పటి నుంచి కంటికి రెప్పలా కాపాడుకుంటుంది. అంతేకాదు, తన బిడ్డ నోటి నుంచి వచ్చే తొలి పలుకులు విని తల్లి ఎంతగానో సంతోషిస్తుంది. కానీ, ఓ తల్లి మాత్రం తన కడుపున పుట్టిన బిడ్డ విషయంలో దారుణానికి ఒడిగట్టింది. నాలుగేళ్ల కుమార్తెను నాలుగో అంతస్తు నుంచి కింద పడేసి హత్య చేసింది.
వివరాల్లోకి వెళ్తే..కర్ణాటక రాష్ట్ర రాజధాని ఉత్తర బెంగళూరులోని ఎస్ఆర్ నగర్లో ఉన్న అపార్ట్మెంట్లో ఈ ఘటన జరిగింది. సీసీటీవీ కెమెరాలో రికార్డ్ అయిన ఫోటోలను పరిశీంచాము. అందులో పాపను కింద పడేసిన తర్వాత ఆమె సైతం కింద దూకేందుకు బాల్కనీ రెయిలింగ్ ఎక్కి కాసేపు నిలబడింది. గమనించిన కుటుంబ సభ్యులు పరుగున వచ్చి ఆమెను వెనక్కి లాగారు. కింద పడిన పాప అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయింది” అని పోలీసులు తెలిపారు.
అయితే, తల్లి మానసిక పరిస్థితి బాగాలేకపోడంతోనే ఈ దారుణం జరిగిందని పోలీసులు తెలిపారు. తన బిడ్డ పుట్టినప్పటి నుంచి నాలుగేళ్ల వయసు వచ్చేసరికి ఆ చిన్నారికి మాటలు రాలేదని, చెవులు కూడా వినబడటం లేదని, దాంతో ఆ మహిళ మానసిక ఒత్తిడికి లోనై, ఈ దారుణానికి పాల్పడిందన్నారు.
అనంతరం ఆమె భర్త ఇచ్చిన ఫిర్యాదుతో నిందితురాలిని అరెస్ట్ చేసినట్లు పోలీసులు తెలిపారు. ఆమె ఒక డెంటిస్ట్‌గా విధులు నిర్వహిస్తుందని, భర్త సాఫ్ట్వేర్ ఇంజినీర్‌గా జాబ్ చేస్తున్నట్లు పొలీసులు పేర్కొన్నారు.