Horrible: Two people died in a house collapse
mictv telugu

ఘోరం: తెల్లారితే నిశ్చితార్థం..ఇల్లు కూలి ఇద్దరు మృతి

July 23, 2022

Horrible: Two people died in a house collapse

తెలంగాణ రాష్ట్రం వరంగల్ జిల్లా తొర్రూరు మండలం మాటేడు గ్రామంలో ఘోరం జరిగింది. తెల్లారితే ఎంగేజ్మెంట్ కార్యక్రమం జరగాల్సి ఉండగా, శుక్రవారం ఉదయం నుంచి అర్ధరాత్రి వరకు కురిసిన వర్షం కారణంగా రాత్రికి రాత్రే దారుణం చోటుచేసుకుంది. పాత భవనం కూలి, ఇద్దరు స్పాట్‌లోనే మృతి చెందారు.

ఇంతెజార్‌గంజ్ పోలీసు స్టేషన్ ఎస్సై తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి.. ‘వరంగల్ జిల్లా దుగొండి మండలం రేబల్లె గ్రామానికి చెందిన తిప్పారాపు పైడి(60) మండి బజార్‌లోని నిర్మాణంలో ఉన్న ఓ భవనానికి వాచ్మెన్‌గా విధులు నిర్వర్తిస్తున్నారు. ఆయనతోపాటు సలీమా అనే మహిళ కూడా అక్కడే పనిచేస్తున్నారు. వారిద్దరూ భవనం చుట్టుపక్కలనే గుడిసెలు వేసుకొని, అందులో నివాసం ఉంటున్నారు. శుక్రవారం సాయంత్రం సలీమా కుమారుడు ఫిరోజ్(22) ఆమెను చూసేందుకు నగరానికి వచ్చాడు.

ఈ క్రమంలో భారీ వర్షం కురుస్తుడడంతో శనివారం తెల్లవారుజామున వారి గుడిసెకు సమీపంలో ఉన్న పాత భవనం ఒక్కసారిగా కుప్పకూలింది. దాంతో పాత భవనానికి సంబంధించిన కొన్ని గోడలు సలీమా నివసిస్తున్న గుడిసెపై పడ్డాయి. ఈ ఘటనలో పైడి, ఫిరోజు ఘటనాస్థలిలోనే మృతి చెందారు. తీవ్రంగా గాయపడిన సలీమాను స్థానికుల సాయంతో ఎంజీఎం ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు’ అని ఆయన అన్నారు.

అనంతరం సలీమా కుమారుడు ఫిరోజ్ తొర్రూరు మండలం మాటేడు గ్రామంలో నివసిస్తున్నారని, ఫిరోజ్‌కు ఈ మధ్యే వివాహం నిశ్చయమైందని, రేపు (ఆదివారం) నిశ్చితార్థం జరగాల్సి ఉండగా.. ఇంతలోనే ఇలా ఘోరం జరిగిందని ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలను ఎస్సై వెల్లడించారు.