Horror: A female essayist was trampled to death by a lorry..where?
mictv telugu

రాంచీలో ఘోరం..మహిళా ఎస్సైని లారీతో తొక్కించి..

July 20, 2022

హర్యానా రాష్ట్రంలో అక్రమ మైనింగ్‌ను అడ్డుకుంటున్నాడని మైనింగ్ మాఫియా మంగళవారం డీఎస్పీ అధికారిని లారీలో తొక్కించి, చంపేసిన విషయం తెలిసిందే. ఈ ఘటన దేశవ్యాప్తంగా కలకలం రేపింది. ఈ ఘటనపై ఉన్నతాధికారులు విచారణ జరుతుండగా, కొన్ని గంటలు గడవకముందే మరో ఘటన జరిగింది. డీఎస్పీ తరహాలోనే ఝార్ఖండ్‌ రాజధాని రాంచీలో ఓ మహిళా ఎస్సైని వాహనంతో తొక్కించి, దారుణంగా హతమార్చారు మైనింగ్ మాఫియా.

”రాంచీ నగరంలోని టుపుదానా ఔట్‌పోస్ట్‌ ఇంఛార్జ్‌గా సబ్‌ ఇన్‌స్పెక్టర్‌ సంధ్య టోప్నే విధులు నిర్వహిస్తున్నారు. రోజులాగే వాహనాలను తనిఖీలు చేస్తుండగా, ఓ వాహనంలో అక్రమంగా పశువులను తరలిస్తున్నారని ఆమెకు సమాచారం అందింది. దాంతో ఆ వాహనాన్ని ఆమె అడ్డుకునేందుకు ప్రయత్నించింది. దాంతో దుండగులు ఎస్సైని వాహనంతో తొక్కించి, చంపేశారు. అక్కడున్న స్థానికులు ఆమెను ఆసుపత్రికి తరలించిన, అప్పటికే ఆమె మరణించింది. నిందితుడిని అరెస్ట్‌ చేసి వాహనాన్ని సీజ్‌ చేశాం” అని సీనియర్‌ ఎస్పీ కౌశల్‌ కిశోర్‌ వివరాలను వెల్లడించారు.

మరోపక్క హర్యానాలో హత్యకు గురైన డీఎస్పీ సురేంద్ర సింగ్‌ బిష్ణోయ్‌ హత్య కేసులో ఓ నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. అరెస్ట్ క్రమంలో జరిగిన ఎన్‌కౌంటర్‌లో నిందితుడు గాయపడినట్లు పోలీసులు తెలిపారు. మిగిలిన వారి కోసం గాలిస్తున్నారు. ఇటువంటి సమయంలో డీఎస్పీని ఎలా చంపేశారో అదే మాదిరిగా రాంచీ నగరంలో మహిళా ఎస్సైని హతమార్చటం సంచలనంగా మారింది.