గేమ్ అడుతుండగా దెయ్యమొచ్చింది..! - MicTv.in - Telugu News
mictv telugu

గేమ్ అడుతుండగా దెయ్యమొచ్చింది..!

August 29, 2017

గదిలో మీరొక్కరే ఉన్నారు.. భయంకరమైన హర్రర్ మూవీ చూస్తున్నారు.. నరాలు తెగే ఉత్కంఠ, గుండెలు జలదరించే సౌండ్.. ఏ క్షణంలోనైనా దాడి చేయడానికి సిద్ధంగా ఉన్న దయ్యం.. మీరు అలా గుడ్లప్పగించి చూస్తున్నారు..

ఇంతలో మీ వెనకాల ఎవరో చేతులేశారు.. !

ఏమవుతుంది మీకు..? గుండెలు కిందికి జారిపోవూ.. !

బ్రిటన్ కు చెందిన టామ్ వెల్డన్ కు అచ్చం ఇలాంటి అనుభవమే ఎదురైంది. గత నెల అతడు వీడియో స్క్రీన్ పై ట్విచ్ హర్రర్  అవుట్ లాస్ట్ 2 అనే గేమ్ ఆడుతుండగా జరిగిందీ ఘటన. టామ్ గేమ్ లో లీనమై ఉన్నాడు ఆ సమయంలో. అంతకు కాసేపటికి ముందు తన రెండేళ్ల కూతురిని ఏదో తీసుకురమ్మని పక్క గదిలోకి పంపాడు. ఆ పాపేమో కాస్త ఆలస్యం చేసింది. ఇతగాడు హర్రర్ లో ముగినిపోయి ఆ విషయం పట్టించుకోలేదు. గేమ్ మధ్యలో ఉండగా ఆ పాప బుడిబుడి అడుగులేస్తూ వచ్చింది. స్క్రీన్ పై ఆమె నీడ కూడా కదలాడిపోయింది. అతడు గమనించలేదు. ఆ పాప మెల్లిగా అతని వెనక్కి వచ్చి ప్రేమగా కౌలిగించేసుకుంది. అంతే..  దెయ్యాల బాగోతంలో ఉన్న టామ్ గుండెలు అదిరిపోయాయి. ప్రాణభయం ఆయన ముఖంలో కొట్టొచ్చినట్టు కనిపించింది. తర్వాత తనను పట్టుకున్నది దెయ్యం కాదని, తన కూతురేనని తెలసుకుని ఊపిరి తీసుకున్నాడు.

ఈ వీడియో క్లిప్ ను జురాసిక్ జంకీ లోనే వీడియో ఫ్లాట్ ఫామ్లో షేర్ 20 లక్షల మంది చూశారట. వీడియో ఫ్లాట్ ఫామ్ పై అత్యధిక మంది చూసిన క్లిప్ గా ఇది గిన్నిస్ రికార్డుకెక్కింది. ఇది తన ఘనత కాదని, తన గుండెల్లో రైళ్లు పరిగెత్తించి కూతురి ఘనత అని టామ్ సంబరంగా చెబుతున్నాడు.