కరోనాకు గుర్రాల యాంటీబాడీస్‌తో చికిత్స - MicTv.in - Telugu News
mictv telugu

కరోనాకు గుర్రాల యాంటీబాడీస్‌తో చికిత్స

September 20, 2020

ncv n

కరోనా వైరస్‌ను రూపుమాపే దిశలో శాస్త్రవేత్తలు ముమ్మరంగా కృషిచేస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో సరికొత్త ప్రయోగాలు తెరమీదకు వస్తున్నాయి. తాజాగా కరోనా రోగులకు గుర్రాలలోని యాంటీబాడీస్‌తో చికిత్స చేయడానికి అమెరికన్ శాస్త్రవేత్తలు సన్నాహాలు పూర్తి చేశారు. 26 మంది కరోనా బాధితులను ఈనెలలో విచారించనున్నారు. కోస్టారికా విశ్వవిద్యాలయంలో ఈ పరిశోధనలు జరుగుతున్నాయి. ట్రయల్స్ విజయవంతమైతే ఆసుపత్రుల్లో పెద్ద ఎత్తున చికిత్స చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. 

ప్రాజెక్ట్ హెడ్ అల్బెర్టో ఆల్ప్ మాట్లాడుతూ.. ‘కొన్నేళ్లుగా గుర్రాల యాంటీబాడీస్‌తో పాము విషం విచ్ఛిన్నం చేస్తున్నాం. దీని నుంచి యాంటీ విషం తయారుచేస్తారు. అదేవిధంగా గుర్రాల యాంటీబాడీస్‌తో కరోనాను అంతమొందించడానికి ప్రయత్నిస్తున్నాం. ఈ ప్రయోగం విజయవంతమైతే మధ్య అమెరికాలోని పేద వర్గాలకు ఉపశమనం కలిగిస్తుంది.

చైనా, బ్రిటన్ దేశాల్లో కరోనా సోకిన గుర్రాలను తెప్పించి పరోశోధనలు చేపట్టాం. వీటికి చికిత్స అందించిన కొన్ని వారాల తరువాత వాటిలో తగినంత యాంటీబాడీస్ సిద్ధంగా ఉంటాయి. అప్పుడు వాటి రక్తం నుంచి ప్లాస్మాను వేరుచేసి తీసుకుని అందులో ఉండే యాంటీబాడీస్‌లను కరోనా రోగులకు చొప్పిస్తారు. ఈ యాంటీబాడీస్ కరోనాతో పోరాడటానికి, మహమ్మారిని శరీరం నుంచి తొలగించేందుకు రోగనిరోధక శక్తిని, ప్రతిస్పందనను పెంచుతాయి. ప్రస్తుతం 26 మంది వైరస్ సోకిన వారిపై పరీక్షలు జరుపుతున్నాం. టీకా ప్రవేశపెట్టే వరకు ఈ చికిత్స పని చేస్తుంది. కరోనా విజృంభిస్తున్న క్రమంలో మన దగ్గర ఉన్న అన్ని మార్గాలను బాగా ఉపయోగించుకోవాల్సిన అవసరం ఉంది. గుర్రాల యాంటీబాడీస్‌తో ప్రయోగానికి ముందు లామా అనే జంతువు యొక్క ప్రతిరోధకాలతో కూడా కరోనాను శరీరంలో నుంచి దూరం చేయవచ్చని నిరూపితమయ్యాయి’ అని అల్బెర్టో తెలిపారు. 

కాగా, గతవారం స్వీడన్ పరిశోధకులు కరోనాను నిరోధించే సామర్ధ్యం కలిగిన నానోబాడీలను కూడా కనుగొన్నారు. నానోబాడీలను స్టాక్‌హోమ్‌లోని కరోలిన్స్‌కా ఇనిస్టిట్యూట్‌లోని 12 ఏళ్ల జంతువు అప్లికా నుంచి సేకరించారు. ఇది వైరస్ ప్రొటీన్ కలిగిన కరోనా రోగికి ఇంజెక్ట్ చేయబడింది. ఈ పరిశోధన పూర్తయినప్పటికీ ఫలితాలు ఇంకా రాలేదు.