Horse hamirpur wedding celebrations
mictv telugu

పెళ్లిలో పెళ్లి చేసిన గుర్రం.. పలువురికి గాయాలు

July 26, 2022

మూగజీవాలకు కోపమొస్తే దృశ్యం మామూలుగా ఉండదు. ముఖ్యంగా ఊరేగింపుల్లో పాల్గొనే ఏనుగులను, గుర్రాలను చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. టపాసుల మోత మోగిస్తూ, డీజే డ్యాన్సులు చేస్తూ అల్లరి పెడితే అవి బెదిరిపోయి బీభత్సం సృష్టిస్తాయి. ఉత్తరప్రదేశ్‌లోని హమీర్పూర్ జిల్లా మౌదాహా పట్టణంలో జరిగిన పెళ్లి ఊరేగింపులో పలువురు యువకులు తీవ్రంగా గాయపడి ఆస్పత్రి పాలయ్యారు. బారాత కోసం తెచ్చిన గుర్రం బ్యాండుబాజాకు బెదరిపై పిచ్చికోపంతో చుట్టుపక్కల ఉన్న జానాలను తొక్కిపారేసింది. ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో విపరీతంగా చక్కర్లు కొడుతోంది. అంతవరకు మామూలుగా ఉన్న గుర్రం అల్లరికి తట్టుకోలేక ముంగాళ్లు పైకి లేపి తొక్కేసింది.