Horseshoe Crab Helping Its Overturned Buddy Flip Is Winning Hearts
mictv telugu

ఫ్రెండ్ అంటే ఈ పీతలా ఉండాలి భయ్యా

November 1, 2022

ఆపదలో ఆదుకున్నోడే ఫ్రెండ్. గంటలు గంటలు సొల్లు మాట్లాడి, పొట్టనిండా తాగి తిని ఎవరి మానాన వాళ్లు వెళ్లిపోయాక ఫ్రెండ్స్‌ను మర్చిపోవడం ఫ్రెండ్షిప్ కాదు. కాస్త దిగాలుగా కనిపిస్తే ‘ఏమైందిరా, ఎనీ ప్రాబ్లమ్?’ అని ఆరా తీయాలి. లేడీస్ అయితే, ‘ఏమైందే, అట్లున్నావ్? తిన్నావా లేదా?’ అని అడగాలి. డబ్బులేకపోతే డబ్బు ఇవ్వాలి. ఆకలిగా ఉంటే బిర్యానీ పెట్టించాలి. అదీ స్నేహమంటే. మనుషులం కాబట్టి ఇన్ని ముచ్చట్లు చెప్పుకుంటాం. మరి నోరువాయి లేని జీవాలైతే? తోటి జీవం కష్టం ఉంటే మరోటి ఏం చేస్తుంది? వాటి స్నేహం కళ్లారా చూడాలంటే ఇదిగో ఈ వీడియో..

ఇంటర్నెట్‌ను షేక్ చేస్తున్న ఈ ఫ్రెండ్‌షిప్ వీడియోలో… హార్స్‌షూ(గుర్రపునాడా) జాతీకి చెందిన పీతలు కొన్ని అక్వేరియంలో ఉన్నాయి. ఓ పీతకు ఏం ఎక్కువైందో ఏమోగాని ఉల్టాపల్టా అయిపోయింది. దిక్కుతెలియక అల్లాడుతుండగా పక్కనే ఉన్న ఫ్రెండ్ గబగబగా వచ్చింది సాయం కోసం. తన శక్తికొద్దీ పోరాడింది. పోరాడి పోరాడి మెల్లగా ఎట్టకేలకు ఫ్రెండును తిరగదిప్పి ‘ఇంకోసారిలా పడిపోమాక’ అని సలహా ఇచ్చి పక్కకు తప్పుకుంది. ఈ వీడియోను చూస్తున్న జనం హెల్పింగ్ పీతను ప్రశంసలతో ముంచెత్తుతున్నారు. ‘కష్టం ఉన్న మనిషికి సాయం చేయకుండా సెల్ఫీలు తీసుకునే మనుషులు వీటిని చూసి నేర్చుకోవాలి,’ అని అంటున్నారు.