రోగులను కొంటాం.. ఆస్పత్రి మూసివేత - MicTv.in - Telugu News
mictv telugu

రోగులను కొంటాం.. ఆస్పత్రి మూసివేత

November 14, 2019

ప్రస్తుత సమాజంలో హాస్పిటళ్ల దందా మూడు పువ్వులు ఆరు కాయలు అన్నట్టుగా సాగుతోంది. రోగుల అవసరాలను ఆసరాగా చేసుకొని దండిగా ఫీజులు గుంజుతూనే ఉన్నారు. తాజాగా రాజమండ్రిలో ఓ హాస్పిటల్ చేసిన నిర్వాకం అందరిని ఆశ్చర్యపరిచింది. రోగులను తమ హాస్పిటల్‌కు పంపించిన వారికి గిఫ్ట్ కార్డులు ఆఫర్ చేసింది. మార్కెట్లో కూరగాయాలను కొన్నట్టుగా రోగులను కొనేస్తున్నారు. దీనికి సంబంధించిన ఓ పోస్టర్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. 

Hospital..

‘ఏస్’ హాస్పిటల్ యాజమాన్యం ప్రథమ వార్షికోత్సవం సందర్భంగా ఇటీవల మెడికల్ ప్రాక్టీషనర్లకు ఆఫర్లు ప్రకటించారు. దీనికి సంబంధించిన ఓ పోస్టర్ రూపొందించారు. అందులో తమ ఆసుపత్రికి పేషెంట్లను పంపిస్తే ఇచ్చే గిఫ్ట్ వివరాలను  అందులో చేర్చారు. నెలకు ఐదుగురు రోగులను పంపిస్తే రూ.1,000,10 మందికి రూ.2,000, 15మందికి రూ. 3,000, 25 మందికి రూ. 6,000 గిఫ్ట్‌కార్డు ఇస్తామంటూ అందులో పేర్కొన్నారు. 

ఇది కాస్తా వైరల్ కావడంతో వైద్య అధికారులు సీరియస్ అయ్యారు. వైద్య వృత్తి విలువలను దిగజార్చేలా ఈ ప్రకటన ఉందంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. వెంటనే యాజమన్యంపై చర్యలు తీసుకున్నారు. ఆ హాస్పిటల్‌కు లైసెన్స్‌ను రద్దు చేశారు. హాస్పిటల్ వైద్యుడు నిఖిల్‌ నోటీసు ఇవ్వనున్నట్లు తెలిపారు. ఇక మీద ఎవరైనా వైద్యలు ఇలాంటి ప్రకటనలు చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని వైద్య మండలి ఛైర్‌పర్సన్‌ సాంబశివారెడ్డి హెచ్చరించారు.