Hospital painted to cover up flaws to prepare for PM Modi’s visit to Morbi, say Congress, AAP
mictv telugu

అర్ధరాత్రి ఆసుపత్రిలో హడావుడి.. ప్రధాని వస్తున్నారని తెలిసి..

November 1, 2022

Hospital painted to cover up flaws to prepare for PM Modi’s visit to Morbi, say Congress, AAP

గుజరాత్‌ రాష్ట్రంల మోర్బీలో జరిగిన కేబుల్ బ్రిడ్జి పెను ప్రమాదంలో ఇప్పటివరకూ 141 మంది ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలిసిందే. ఈ ప్రమాదంపై ఇప్పటికే సంతాపం తెలిపిన ప్రధాని నరేంద్ర మోడీ… నేడు ప్రమాద స్థలానికి వెళ్లనున్నారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న క్షతగాత్రులను పరామర్శించనున్నారు.

అయితే ప్రధాని వస్తున్నారని తెలిసి అధికారులు అప్రమత్తమయ్యారు. వెంటనే ఆసుపత్రిలోని లోపాలను సరిచేసేందుకు.. అక్కడి గోడలకు రంగులేయడం, వ్యర్ధాలను తొలగించడం, ఇంకా ఆ హాస్పిటల్‌లో పేరుకుపోయిన సమస్యలపై దృష్టి పెట్టారు. రాత్రికి రాత్రే ఆసుపత్రి గోడలకు రంగులు వేయించడంతో పాటు అవసరమైన మరమ్మతులు చేపట్టారు.

ఆసుపత్రి గోడలు, పైకప్పు భాగాలకు పెయింట్‌ వేశారు. టైల్స్‌ మార్చారు. కొత్త కూలర్‌లను తీసుకువచ్చారు. వంతెన దుర్ఘటనలో గాయపడిన 13 మందిని చేర్చుకున్న రెండు వార్డులలో బెడ్‌షీట్‌లు ఉన్నపళంగా మార్చేశారు. సిబ్బంది అంతా అర్థరాత్రి ప్రాంగణాన్ని ఊడ్చి క్లీన్‌గా చేశారు. మొత్తంగా ఆసుపత్రిని తళతళ మెరిసేలా చేశారు. స్థానిక మీడియాకు ఈ విషయం తెలిసి అక్కడికి చేరుకొని పెయింటింగ్ వేస్తున్న సిబ్బందిని, మరమ్మతులను ఫొటోలు తీసి ఛానెళ్లలో ప్రసారం చేసింది. ఈ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

ప్రతిపక్షాలు మండిపడుతున్నాయి. ప్రధాని నరేంద్ర మోదీ ఫొటోషూట్ కోసం బీజేపీ బిజీబిజీగా ఏర్పాట్లు చేస్తోందని కాంగ్రెస్, ఆమ్ ఆద్మీ పార్టీల నేతలు విమర్శలు గుప్పించారు. ఓవైపు పెద్ద సంఖ్యలో జనం చనిపోవడం, బాధిత కుటుంబాలు తీరని దుఖంలో మునిగిపోగా.. బీజేపీ పెద్దలు మాత్రం ప్రధాని పర్యటన కోసం ఏర్పాట్లలో మునిగిపోవడం విచారకరమని కాంగ్రెస్ పార్టీ ట్వీట్ చేసింది. ప్రభుత్వ ఆసుపత్రిలో అంతా బాగుందని ప్రధానికి చూపించేందుకు అధికారులు అర్ధరాత్రి ఏర్పాట్లు చేస్తున్నారని ఆమ్ ఆద్మీ పార్టీ ట్విట్టర్లో ఆరోపించింది.