వేడినీళ్లతో కరోనా ఛస్తుంది.. పరిశోధనలో నిర్ధారణ - MicTv.in - Telugu News
mictv telugu

వేడినీళ్లతో కరోనా ఛస్తుంది.. పరిశోధనలో నిర్ధారణ

August 4, 2020

Hot water removes coronavirus from body russian scientist

ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వైరస్ కి వ్యాక్సిన్ కనిపెట్టడానికి ప్రపంచవ్యాప్తంగా 160కి పైగా పరిశోధనలు జరుగుతూన్నాయి. ఈ నేపథ్యంలో కరోనా గురించి రోజుకో ఆసక్తికర విషయం బయటికి వస్తుంది. తాజాగా కరోనాపై పరిశోధన చేస్తున్న రష్య‌ శాస్త్రవేత్తలు ఈ ఆసక్తికర విషయాన్ని వెల్లడించారు. గోరువెచ్చని నీరు తాగితే కరోనా వైరస్‌ నాశనం అవుతున్నదని తెలిపారు. 

గది ఉష్ణోగ్రత కలిగిన నీరు కరోనాకి కారణమయ్యే సార్స్‌ సీఓవీ-2 వైరస్ పెరుగుదలను ఆపగలదని సైబీరియాలోని నోవోసిబిర్స్క్‌లోని రష్యా వెక్టర్ స్టేట్ రీసెర్చ్ సెంటర్ ఆఫ్ వైరాలజీ అండ్ బయోటెక్నాలజీకి చెందిన ఒక పరిశోధనా బృందం గుర్తించింది. గది ఉష్ణోగ్రత‌ కలిగిన నీరు ఒక రోజు వ్యవధిలో కరోనా వైరస్‌కు చెందిన 90 శాతం కణాలను చంపగలదని, అదే మూడు రోజుల్లో 99.9 శాతం కణాలను నాశనం చేస్తుందని రష్యా పరిశోధకులు తెలిపారు. అలాగే, మరుగుతున్న నీరు కరోనా వైరస్‌ను పూర్తిగా చంపగలదని గుర్తించారు. కరోనా వైరస్‌ క్లోరినేటెడ్ నీరు, సముద్రపు నీటిలో జీవించగలిగినప్పటికీ, తన సంతతిని పెంచుకోలేకపోతుందని వెల్లడించారు.