Hotcakes India-Pak Match Tickets: ICC
mictv telugu

హాట్‌‌కేకుల్లా భారత్-పాక్‌ మ్యాచ్‌ టిక్కెట్లు: ఐసీసీ

September 16, 2022

ప్రపంచవ్యాప్తంగా క్రికెట్‌ ఆటకు ఎంతమంది ఫ్యాన్స్ ఉన్నారో అంచనా వేయటం అసాధ్యమైన పని. ఆయా దేశాల మధ్య ఎప్పుడు ఏ చిన్న మ్యాచ్ జరిగిన టీవీలకు అతుక్కుపోతుంటారు. మరి ముఖ్యంగా టెస్ట్, వన్డే, ఆసియా కప్, టీ20, వరల్డ్ కప్ మ్యాచ్‌లు జరిగితే గనకు అభిమానులకు ఇక పండగే. కేరింతలు కొడుతూ, ఎంత ఖర్చైన క్షణం ఆలోచించకుండా, తండోపతండాలుగా టికెట్లు కొనుక్కొని, మైదానంలోకి వెళ్లి మ్యాచ్‌లను వీక్షిస్తుంటారు. అందులో భారత్-పాక్‌ల మధ్య మ్యాచ్‌ అంటే ఆ ఉత్సహం మాములుగా ఉండదు. ఆ మైదానం ఏ దేశంలో ఉన్నా, ఏ ప్రాంతంలో ఉన్నా సరే ఇట్లే టికెట్లు అమ్ముడుపోతాయి.

తాజాగా భారత్-పాక్‌ల మధ్య జరగబోయే మ్యాచ్‌కు సంబంధించి, ఐసీసీ ఓ సంచలన విషయాన్ని వెల్లడించింది. వచ్చే నెల 16వ తేదీ నుంచి ఆస్ట్రేలియాలో టీ20 ప్రపంచకప్‌ మ్యాచ్‌లు జరగనున్న విషయం తెలిసిందే. అయితే, అక్టోబర్‌ 23న మెల్‌బోర్న్‌లో జరిగే ఇండియా, పాకిస్తాన్ మ్యాచ్‌ టిక్కెట్లు హాట్‌కేకుల్లా అమ్ముడుపోయాయని ఐసీసీ ట్విటర్ వేదికగా వెల్లడించింది. స్టాండింగ్‌ రూమ్‌‌తో సహా టిక్కెట్లు అన్ని అమ్మకానికి పెట్టిన, కొద్ది వ్యవధిలోనే అమ్ముడయ్యాయని తెలిపింది. ప్రపంచవ్యాప్తంగా ఐదు లక్షలమంది అభిమానులు టిక్కెట్లను రిజర్వ్‌ చేసుకున్నారని పేర్కొంది.

”అక్టోబర్‌ 23న మెల్‌బోర్న్‌లో జరిగే ఇండియా, పాకిస్తాన్ మ్యాచ్‌ టిక్కెట్లు హాట్‌కేకుల్లా అమ్ముడుపోయాయి. దాదాపు 5 లక్షల మంది టికెట్లు రిజర్వ్ చేసుకున్నారు. టీ 20 ప్రపంచకప్ ఫైనల్‌ను 88 వేల మందికిపైగా అభిమానులు వీక్షించనున్నారు” అని ఐసీసీ తెలిపింది.