Hotel staff attack Swiggy delivery boy with rods and sticks in Gachibowli, Hyderabad
mictv telugu

స్విగ్గీ డెలివరీ బాయ్‌పై 20 మంది హోటల్ సిబ్బంది దాడి

June 4, 2022

Hotel staff attack Swiggy delivery boy with rods and sticks in Gachibowli, Hyderabad

హైదరాబాద్‌ నగరంలోని గచ్చిబౌలి పీఎస్‌ పరిధిలో ఓ హోటల్‌ యాజమాన్యం దౌర్జన్యంగా ప్రవర్తించింది. ఫుడ్ ఆలస్యంపై అడిగినందుకు స్విగ్గీ డెలివరీ బాయ్‌పై దాడి చేసింది. ఫుడ్‌ సర్వీస్‌ కోసం వచ్చిన డెలివరీ బాయ్‌ అరగంట పాటు అక్కడే ఎదురుచూశాడు. ఆలస్యమవుతుందని హోటల్‌ యజమానిని అడగడంతో డెలివరీ బాయ్‌పై యజమానితో సహా హోటల్‌ సిబ్బంది 20 మంది రాడ్లు, కర్రలతో దాడి చేశారు.

సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకొని గాయపడిన డెలివరీ బాయ్‌ను ఆస్పత్రికి తరలించారు. డెలివరీ బాయ్‌పై దాడి నేపథ్యంలో బాధితుడికి న్యాయం చేయాలంటూ హోటల్‌ ముందు స్విగ్గీ డెలివరీ బాయ్స్‌ ఆందోళనకు దిగారు. హోటల్‌ యాజమానిపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు