హోటల్స్ బంద్...మరి మీల్స్ ఎక్కడ..? - MicTv.in - Telugu News
mictv telugu

హోటల్స్ బంద్…మరి మీల్స్ ఎక్కడ..?

May 30, 2017

లంచ్ టైమ్ అయిందంటే హోటల్స్ వెతుకుతాం. రోజూలాగే ఏదో హోటల్ కు పోయి ఆకలి తీర్చుకుంటామంటే కుదరదు.ఎందుకంటే హోటల్స్ సమ్మెలో ఉన్నాయి. తాళాలు వేసి మరి ఆందోళనచేస్తున్నాయి. ఎందుకంటే…

తెలుగురాష్ట్రాల్లో హోటల్స్ మూతపడ్డాయి.పెనుభారం మోపే జీఎస్టీ పన్నురేటును తగ్గించాలని కోరుతూ యాజమాన్యాలు బంద్‌ పాటిస్తున్నాయి. దీంతో నగరాలు, పట్టణాల్లో హోటళ్లు మూతపడ్డాయి. జీఎస్టీ పన్నురేటును తగ్గించి స్టార్‌, నాన్‌స్టార్‌ హోటళ్ల ప్రాతిపదికన పన్నురేటు నిర్ణయించాలని తెలంగాణ రాష్ట్ర హోటల్స్‌ అసోసియేషన్‌ డిమాండ్‌ చేసింది. ఒక్కరోజు బంద్‌లో భాగంగా అబిడ్స్‌లోని తాజ్‌మహల్‌ హోటల్‌ ఎదుట యజమానులు నిరనసకు దిగారు. కేంద్రం తీసుకున్న నిర్ణయంతో హోటళ్లు మూతపడే దశకు చేరుకున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. మధ్యశ్రేణి హోటళ్ల నుంచి 18శాతం జీఎస్టీ వల్ల సామాన్యులతో పాటు ఆతిథ్య రంగంపైనా పెను ప్రభావం చూపుతుందన్నారు.