రెస్టారెంట్లో వసూలు చేసే సర్వీస్ ఛార్జ్‌ల గురించి కస్టమర్లకు గుడ్ న్యూస్ అందింది. రెస్టారెంట్, హోటళ్లకు షాకిచ్చేలా ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఆహార బిల్లులపై డిఫాల్ట్‌గా సర్వీస్ ఛార్జ్ విధించకూడదని సెంట్రల్ కన్స్యూమర్ ప్రొటెక్షన్ అథారిటీ (CCPA) సోమవారం తీర్పు వెల్లడించింది. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వం సర్వీస్ చార్జీలను రద్దు చేస్తున్నట్లు ఓ కీలక ప్రకటన చేసింది. అంతేకాకుండా ఇకపై ఏ హోటల్ గానీ, రెస్టారెంట్ గానీ సర్వీస్ చార్జీలను వసూలు చేయరాదంటూ కఠిన ఆదేశాలు జారీ చేసింది కేంద్రం. ఏ బిల్లుకు అయినా జీఎస్టీ పన్ను వసూలు చేస్తున్న నేపథ్యంలో సర్వీస్ చార్జీ అనే మాటే ఎత్తకూడదన్నది కేంద్ర ప్రభుత్వ ఉద్దేశ్యంగా తెలుస్తోంది.
వస్తువులు, సేవలపై జీఎస్టీ పేరిట పన్ను వేస్తున్నప్పుడు ఇక హోటళ్లు, రెస్టారెంట్లు సర్వీస్ చార్జీల పేరిట అదనపు పన్ను వేస్తున్నారు. ఈ వైనంపై దృష్టి సారించిన కేంద్ర వినియోగదారుల వ్యవహారాల మంత్రిత్వ శాఖ సర్వీస్ చార్జీలు వసూలు చేయరాదంటూ ఆదేశాలు జారీ చేసింది. ఇక ఎప్పుడైనా హోటల్‌కు వెళితే.. సర్వీస్ చార్జీలు కట్టకండి.. అడిగితే అధికారులకు ఫిర్యాదు చేయండి.