Home > Featured > సెకండ్లలో కుప్పకూలిన ఇళ్లు

సెకండ్లలో కుప్పకూలిన ఇళ్లు

ఉత్తరాదిని వర్షాలు వణికిస్తున్నాయి. భారీ వర్షాలకు వరద నీరు పెద్ద ఎత్తున ఇళ్లలోకి వచ్చి చేరుతోంది. ఎడతెరపిలేని వానల కారణంగా ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. ఉత్తరప్రదేశ్‌లో కురుస్తున్న భారీ వర్షాలకు ఓ ఇళ్లు ఒక్కసారిగా కుప్పకూలింది. సెకండ్లలోనే భారీ ఇళ్లు నేలమట్టమైంది. గంగా నదిని ఆనుకొని ఉన్న ఈ ఇళ్లు వరదల తాకిడికి ఇంటి కింది భాగం కోతకు గురై ఇళ్లు కూలిపోయింది.

బైరియా తహసీల్ ప్రాంతంలోని కెహర్‌పూర్ వద్ద భారీ వర్షానికి ఓ ఇళ్లు కుప్పకూలింది. అప్పటి వరకు ప్రశాంతంగా ఉన్న అక్కడి వాతావరణం ఒక్కసారిగా భయాందోళనకు గురి చేసింది. వర్షానికి తడిపోసిపోయి అటూ ఇటూ ఊగుతూ ఒక్కసారిగా పేకమేడలా కూలిపోయింది. కొన్ని సెకండ్ల సమయంలోనే ఇళ్లు నామరూపాలు లేకుండా పోయింది. ఈ ఘటన జరిగిన సమయంలో ఇంట్లో ఎవరూ లేకపోవడంతో భారీ ప్రమాదం తప్పింది. అప్పటి వరకు బాగానే ఉన్న ఇళ్లు ఒక్కసారిగా కుప్పకూలిపోవడంతో యజమాని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

Updated : 16 Sep 2019 12:42 AM GMT
Tags:    
Next Story
Share it
Top