జగన్ సభ కోసం పేదల ఇళ్ళు కూల్చివేత - MicTv.in - Telugu News
mictv telugu

జగన్ సభ కోసం పేదల ఇళ్ళు కూల్చివేత

October 9, 2019

గతంలో తెలంగాణ ప్రభుత్వం కంటి వెలుగు పథకాన్ని ప్రవేశపెట్టిన సంగతి తెలిసిందే. ఈ పథకం ద్వారా తెలంగాణ ప్రజలందరికీ ఉచితంగా కంటి పరీక్షలు, కళ్లద్దాల పంపిణీ, శస్త్ర చికిత్సలు ఉచిత కంటి వైద్యం అందించారు. కాగా, ఈ పథకాన్ని ఆంధప్రదేశ్ ప్రభుత్వం ‘వైఎస్సార్‌ కంటి వెలుగు’ పేరుతో ప్రవేశపెట్టబోతుంది. ఈ పథకాన్ని అనంతపురం జిల్లాలోని జూనియర్ కాలేజ్ గ్రౌండ్స్‌లో సీఎం జగన్ గురువారం ప్రారంభించనున్నారు.

jagan meeting.

అయితే జగన్ సభ, వేదిక కోసం 50 ఏళ్లుగా ఉంటున్న ఇళ్లను అధికారులు జేసీబీతో తొలగించారు. ఇదేంటని ప్రశ్నించినవారిపై అధికారులు దౌర్జన్యం చేశారు. దీంతో రెండు గంటలుగా అక్కడ ఉద్రిక్తత నెలకొంది. ఈ సంఘటన కోసం వెళ్లిన మీడియా ప్రతినిధులపై అధికారులు దౌర్జన్యం చేశారు. బహిరంగసభ ఏర్పాటు చేసిన సభా వేదిక దగ్గర పేదల గుడిసెలు, పీర్ల చావిడి ఉంది. వాటిని మున్సిపల్ అధికారులు బుధవారం తొలగించారు. సీఎం పర్యటన నిరుపేదల పాలిట శాపంగా మారిందని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పీర్ల చావిడిని తొలగించవద్దని ముస్లిం మత పెద్దలు అధికారులవద్దకు వెళ్లి వేడుకున్నా వారు వినలేదు.