ఇంటి ఓనర్ కు  రోగం బుట్టింది..!   - MicTv.in - Telugu News
mictv telugu

ఇంటి ఓనర్ కు  రోగం బుట్టింది..!  

September 14, 2017

ఏం మనుషులం తయారైతున్నమో ఏమో పోన్రి..చీ చీ చీ, మనకన్నా నోరులేని జంతువులు, చలనంలేని శెట్లు, పుట్టలూ నయ్యం, వాటికన్న అధ్వానం తయారైతున్నం. రోజు రోజుకు బండరాయిల కంటే గట్టిగ మన మన్సులు తయారైతున్నయ్. హైదరాబాద్ కూకట్ పల్లిలో ఓ ఇంట్లో కిరాయికి ఉంటున్న ఈశ్వరమ్మ అనే మహిళ కొడుకు, సురేశ్ అనే పదేళ్ల బాబు పాపం నిన్న రాత్రి డెంగ్యూతో  చనిపోయిండు. అసలే కన్నబిడ్డను కోల్పోయి పుట్టెడు దుఖంలో తల్లిదండ్రులు ఉంటే, శవాన్ని ఇంట్లోకి తీసుకురావొద్దంటూ ఇంటి ఓనర్ అడ్డుకున్నాడు. స్థానికులు వచ్చి అడిగినా ససేమిరా శవాన్ని నా ఇంట్లోకి రానియ్య అని మొండికేసి కూర్చున్నడు.  దీంతో చేసేదేం లేక వర్షంలోనే బిడ్డ శవంతో  రాత్రంతా గడిపారు కుటుంబ సభ్యులు. ఇంటి ముందు ఉన్న అరుగుపైనే చిన్నారిని ఉంచి.. తడవకుండా ఉండేందుకు ఈ కుటుంబ సభ్యులే దుప్పట్లతో అడ్డం ఉన్నారు. ఓ వైపు భారీ వర్షం, వాళ్ల పరిస్ధితిని చూసి చుట్టుపక్కలవారు అప్పటికప్పుడు బాక్స్ తీసుకొచ్చి చిన్నారి మృతదేహాన్ని అందులో ఉంచారు. కాలనీలో ఉంటున్న కొందరు ఆర్థికసాయం చేశారు.

అంత్యక్రియలకు సహకారం అందించారు. అయినా సావు..జర వెనకా ముందో అందర్కి వస్తది. ఆ ఇంటి ఓనర్ ఎల్లకాలం సావకుంట అట్లనే బత్కుతాడు. ముట్టుడు అనే నయంగాని భయంకరమైన రోగం అచ్చిన ఆ ఇంటి ఓనర్ పై  స్థానికులు మండిపడుతున్నారు.