లాక్‌డౌన్ నేరం..అద్దె కోసం వేధించాడని పొడిచి చంపాడు.. - MicTv.in - Telugu News
mictv telugu

లాక్‌డౌన్ నేరం..అద్దె కోసం వేధించాడని పొడిచి చంపాడు..

July 9, 2020

House rent incident in chennai

లాక్ డౌన్ కారణంగా ఎందరో జనాలు ఉపాధి కోల్పోయారు. ఇంటి అద్దెలు కూడా కట్టలేని పరిస్థితి. దీంతో అద్దెల కోసం ఇబ్బంది పెట్టకూడదని ప్రభుత్వాలు కూడా సూచించాయి. అయినా కూడా కొందరు యజమానులు అద్దెల కోసం కిరాయిదారులను వేధిస్తున్నారు. దీంతో దారుణాలు జరుగుతున్నాయి. తాజాగా అద్దె కోసం వేధించిన ఇంటి యజమానిని కిరాయిదారు కొడుకు అత్యంత దారుణంగా చంపిన ఘటన చెన్నైలో జరిగింది. నగరంలోని కుండ్రటూరులో ధనరాజ్ అనే వ్యక్తి గుణశేఖర్ అనే వ్యక్తి ఇంట్లో అద్దెకు ఉంటున్నాడు. 

లాక్ డౌన్ కారణంగా గత నాలుగు నెలలుగా ధనరాజ్ ఉపాధి కోల్పోయాడు. దీంతో అద్దె చెల్లించలేని పరిస్థితి. గత నాలుగు నెలలుగా అద్దె ఇవ్వడం లేదు. దీంతో అద్దె కోసం గుణశేఖర్.. ధనరాజ్ మీద పదేపదే ఒత్తిడి తీసుకొస్తున్నాడు. ధనరాజ్ తో ఘర్షణకు దిగాడు. అద్దె చెల్లించాల్సిందే నంటూ పట్టుపట్టాడు. అద్దె కోసం తన తండ్రిని నానా మాటలు అంటున్న ఇంటి యజమాని తీరును ధనరాజ్ తనయుడు అజిత్ చూడలేకపోయాడు. పట్టలేని కోపంతో ఇంటి యజమానిపై కత్తితో దాడి చేసి దారుణంగా హతమార్చాడు. దీంతో పోలీసులు అజిత్ ను అరెస్ట్ చేశారు.