దేశంలో రియల్ ఎస్టేట్ రంగ పురోగతి ఏ విధంగా ఉందో చాటి చెప్పే ఫోటో ఇది. ఒక్కో ఇంటి ఖరీదు రూ. 7 కోట్లయితే మొత్తం 1137 ఇళ్ళు కేవలం మూడు రోజుల్లోనే అమ్ముడుపోవడం సంచలనంగా మారింది. కోట్ల ధర ఉన్న ఇళ్ల కోసం కొనుగోలు దారులు సంతలో ఎగబడ్డట్టు ఎగబడిన ఫోటో ఒకటి వైరల్ అవుతోంది. దేశ రాజధాని ఢిల్లీ శివారు గుర్‌గావ్‌లోని రియల్ ఎస్టేట్ దిగ్గజం డీఎల్ఎఫ్ అర్బర్ ప్రాజెక్టు వద్ద ఈ దృష్యం కనపడింది.
Just checked with a DLF broker…says entire project of 1137 flats at 7 cr a piece has been sold out in 3 days 🤐
Mind gone numb 😲 https://t.co/UpvNnsH0H3
— Alok Jain ⚡ (@WeekendInvestng) February 21, 2023
లగ్జరీ ప్రాజెక్టులోని ఫ్లాట్ల అమ్మకాలకు జనం విపరీతంగా వచ్చారని వీకెండ్ ఇన్వెస్టింగ్ సంస్థ అధినేత అలోక్ జైన్ ట్విట్టర్‌లో పోస్ట్ చేశారు. దీనిపై నెటిజన్లు భిన్నంగా స్పందిస్తున్నారు. రియల్ ఎస్టేట్ పడిపోతోంది అని అరిచేవాళ్లకు ఈ ఫోటో సమాధానమని అంటున్నారు. దేశంలో సంపద పెరిగిందనడానికి ఇది రుజువని చెప్తున్నారు. అయితే మరోకోణంలో చూసేవారు కూడా ఉన్నారు. ఇదంతా ఇన్వెస్టర్లు, బ్రోకర్ల మాయాజాలమని విమర్శిస్తున్నారు. అయితే ఈ ఫోటోని డీఎల్ఎఫ్ సంస్థ ధ్రువీకరించాల్సి ఉంది.\